టాలీవుడ్ లో శర్వానంద్ అనగానే చాలా మందికి ఒక సినిమా బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం... అల్లరి నరేష్ తో కలిసి శర్వానంద్ చేసిన ఆ సినిమా అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది అనేది వాస్తవం. తన నటనలో ఆ సినిమాలో చాలా వైవిధ్యం చూపించాడు శర్వానంద్. తనకు ఉన్న రేంజ్ ని సినిమాలో కాపాడుకుంటూనే... ఒక మంచి స్నేహితుడిగా నటించాడు. ముఖ్యంగా అల్లరి నరేష్ తో అతను చేసిన కొన్ని సన్నివేశాలు టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసేసాయి. 

 

సినిమా ఇప్పుడు వచ్చినా సరే ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత అతని కెరీర్ లో వచ్చిన మరో బిగ్ హిట్ నిత్యా మీనన్ తో కలిసి నటించిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా. ఈ సినిమా అతని కెరీర్ లో మైలురాయి. ప్రతీ సీన్ లో కూడా శర్వా చాలా పరిణితి తో నటించాడు. దర్శకుడు క్రాంతి మాధవ్ కి తన నుంచి ఎం కావాలో అది ఇవ్వడంలో దాదాపుగా సఫలం అయ్యాడు. ఇక సినిమాలో పవిత్రా లోకేష్ కొడుకుగా కూడా శర్వా మంచి మార్కులు కొట్టేసాడు. 

 

ప్రేమకు ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో అతని నటన చాలా అందం గా ఉందని ఎందరో విమర్శకులు అన్నారు. ఈ సినిమా కూడా టీవీ లో వస్తుంటే ఇప్పటికి చాలా మంది చూస్తూ ఉంటారు. ప్రతీ సన్నివేశం కూడా ఆ సినిమాలో అలా నిలిచిపోయింది. అయితే హీరో రేంజ్ కి ఆ సినిమా చాలా పెద్దది అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసారు. అయినా సరే శర్వా ను చాలా మంది మెచ్చుకున్నారు. అలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: