టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో శర్వానంద్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దీనికి కారణం అతనికి ఉన్న గ్లామర్. శర్వానంద్ ని చూసి చాలా మంది చేసిన కామెంట్ ఒకటే. ఉదయ్ కిరణ్, తరుణ్ లేని లోటుని ఇతను తీర్చాడు అని. అలాంటి మంచి సినిమాలే చేస్తూ పక్కింటి అబ్బాయిగా కనిపించాడు చాలా మందికి. ఇక అమ్మాయిల్లో, యూత్ లో అతనికి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా అతని నవ్వుకి అమ్మాయిలు ఫిదా అయిపోతారని అంటూ ఉంటారు. 

 

సోషల్ మీడియాలో అతనికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ఎక్కడా తగ్గించుకోకుండా అతను సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా అతను చేసే ప్రేమ కథలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. జాను సినిమా ఫ్లాప్ అయినా సరే బాబు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దర్శకుడు ఏ విధంగా కోరుకుంటాడో ఆ విధంగా నటిస్తూ అతను ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు. ఎలాంటి పాత్ర అయినా సరే ఎక్కడ ఇబ్బంది పడినట్టు కనిపించలేదు అతను. ప్రస్తుతం అతను మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. 

 

ఇక కాలేజ్ అమ్మాయిలు అతన్ని బావా అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతని సినిమా వస్తుంది అంటే చాలు అమ్మాయిలు మా బావ సినిమా వస్తుంది అంటూ కామెంట్ చేసే వారు. ఆ విధంగా అతను కెరీర్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కథల ఎంపికలో శర్వా కాస్త ఇబ్బంది పడుతున్నాడు గాని కెరీర్ గాడిలో పడితే మాత్రం అతనికి తిరుగు ఉండదు అంటున్నారు టాలీవుడ్ జనాలు. మరో రెండు హిట్స్ వస్తే చాలు అతని కెరీర్ గాడిలో పడుతుంది అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఎంత వరకు కెరీర్ లో జాగ్రత్త పడతాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: