టాలీవుడ్ లో కొంత మందికి నచ్చకపోతే సినిమాలు చేయలేరా...? కొంత మంది కనపడకపోతే కాళ్ళ మీద పడక తప్పదా...? ఏమో ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఇది నిజమే అంటున్నారు టాలీవుడ్ జనం. సినిమా పెద్దల పేరుతో కొంత మంది రెచ్చిపోవడం ఇప్పుడు బాధ కలిగిస్తుందని అంటున్నారు. సినిమా అనేది చాలా మందికి ఒక పిచ్చి అని, అలాంటి సినిమా విషయంలో కొందరు అనుసరిస్తున్న ధోరణి మాత్రం ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు. సినిమా అంటే నటుడు కూడా చిరాకు పడే పరిస్థితి ఉంటుంది అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఈ మధ్య కొందరికి కొందరు ఎదురు తిరిగితే మరికొందరు ఎక్కువగా హడావుడి చేస్తూ ఇంకొందరి ద్వారా బెదిరింపుల కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇష్టం అయితే సిని పరిశ్రమలో ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలని, ఎక్కువ చేస్తే అవకాశాలు కూడా రావాని వార్నింగ్ లు ఇస్తున్నారు. ఆయన ఆడియో కార్యక్రమానికి వచ్చినప్పుడు అందరూ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోలేదు...? అంత బలుపా అంటూ మండిపడుతున్నారు. సినిమాలో నటించాలి అంటే కచ్చితంగా కాళ్ళ మీద పడాలి అంటూ హెచ్చరికలు జారి చేస్తున్నారు. 

 

ఈ మధ్య ఈ దరిద్రం కాస్త ఎక్కువైంది అనే మాట ఎక్కువగా వినపడుతుంది. మాట వినకపోతే ఎవడ్ని అయినా సరే ఎవడు అయినా ఇబ్బంది పెడతాడని, మాట వినకపోవడం పక్కన పెడితే కాళ్ళ మీద పడకపోతే ఆశీర్వాదం తీసుకోకపోతే మాత్రం చిరు నవ్వుతో ఇబ్బంది పెడతారని, కనీసం ఇబ్బంది పడినట్టు కూడా తెలియకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల ఆడియో కార్యక్రమాలకు ఒక పెద్ద హాజరవుతున్నారు, సీనియర్ నటులు కూడా ఆయన కాళ్ళ మీద ఎక్కువగా పడుతున్నారు. ఆయన కాళ్ళ మీద పడకపోతే యువ నటులను ఊరుకోవడం లేదు పాపం. మరి ఆశీర్వాదాలు కూడా అడ్డుక్కోవడం ఏంటో...

మరింత సమాచారం తెలుసుకోండి: