ప్రస్తుత కాలంలో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఏ హీరో కి లేదేమో అనిపిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ స్టార్ట్ అయిన రోజు నుండి ఇప్పటివరకు అద్భుతమైన నటనతో, డాన్స్ లతో, ఒక్కో సినిమాకి ఒక్కో ఫిట్నెస్ చూపిస్తూ దుమ్ము లేపుతున్నాడు. మరోవైపు ఎలక్షన్స్ సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసి తనలో ఓ గొప్ప వ్యాఖ్యాత, రాజకీయ వేత్త, శక్తివంతమైన లీడర్ ఉన్నాడని చాటుకున్నాడు. ఇవన్నీ మనకు ఎన్టీఆర్ గురించి తెలిసిన విషయాలు. మరి అతను ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారో ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు.




పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడైన రాహుల్ విజయ్ హీరోగా నటించిన 'కాలేజీ కుమార్' చిత్రం నిన్న అనగా మార్చి 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే ఈ క్రమంలోనే కుర్ర హీరో రాహుల్ విజయ్ మీడియా తో పలు విషయాలు చెప్పుకొచ్చాడు. అతని మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా తాను జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.




రాహుల్ విజయ్ మాట్లాడుతూ తమకు కష్టం వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటారని, తనలో దయాగుణం చాలా ఎక్కువగా ఉందని, నటన విషయంలో తారక్ అన్నయ్యే తనకు స్పూర్తి దాయకమని చెప్పుకొచ్చాడు. తాను ఇంకా మాట్లాడుతూ.. ఇష్టమైన హీరో ఎవరు? అని ప్రశ్నిస్తే తన మైండ్ లోకి జూనియర్ ఎన్టీఆర్ తప్ప మరే ఇతర హీరో గుర్తుకురాడని చెబుతూ తారక్ పై తనకున్న అభిమానాన్ని మళ్లీ చాటుకున్నాడు. ఇకపోతే రజినీకాంత్ అంటే కూడా తనకి అభిమానం ఉందని, చిన్నప్పటినుండి తనకి తాను ఫ్యాన్ అని, అతని స్టయిల్ అంటే తనకు పిచ్చి అని తెలిపాడు.



'ఈ మాయ పేరేమిటో' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాహుల్ విజయ్ తర్వాత వచ్చిన సూర్యకాంతం సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు హీరోగా నిరూపించుకోవడానికి కాలేజీ కుమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే 'కాలేజీ కుమార్' సినిమా కన్నడ రీమేక్ కావడం, అదే టైటిల్ ని తెలుగు కూడా ఖరారు చేయడం విశేషం. ఈ సినిమాలో లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తో నటించడం ఆనందంగా ఉందని తన ప్రసంగాన్ని ముగించాడు రాహుల్ విజయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: