సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో కాజల్ కు తిరుగులేని స్థానం ఉంది. స్టార్ హీరోయిన్లలకు మెయిన్ ఆప్షన్ గా మారిన కాజల్ రెమ్యునరేషన్ కూడా రెండు కోట్ల వరకూ తీసుకుని మంచి స్టార్ డమ్ అనుభవించింది. సినిమాల్లోకి వచ్చి 13ఏళ్లు పూర్తి చేసుకుని లాంగ్ కెరీర్ చూసింది. ప్రస్తుతం కాజల్ కు పెద్దగా సినిమా అవకాశాలేమీ రావడం లేదు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న భారతీయుడు2 మినహా కాజల్ చేస్తున్న సినిమాలేమీ లేవు.

 

 

తెలుగులో ఆమెను పరిచయం చేసిన దర్శకుడు తేజ తన కొత్త సినిమాలో కాజల్ ను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. గోపీచంద్ హీరోగా తేజ ప్రకటించిన అలివేలుమంగ వెంకటరమణ సినిమా కోసం కాజల్ సంప్రదించినట్టు టాలీవుడ్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. కానీ అమ్మడు చెప్పిన రెమ్యునరేషన్ ఫిగర్ చూసి అంతా అవాక్కయ్యారట. ప్రస్తుతం ఫామ్ లో కూడా లేని కాజల్ ఇంత భారీ ఫిగర్ చెప్పడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం కాజల్ తో సినిమాకు వచ్చే క్రేజ్ కూడా ఏమీ లేదని అనుకుంటున్నట్టు టాక్. ప్రస్తుతం ఈ వార్త సినీ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. మరి మేకర్స్ నిర్ణయమేంటో తెలియాల్సి ఉంది.

 

 

ఎంతలేదన్నా కాజల్ కి ఫ్యాన్స్ ఉన్నారు.. క్రేజ్ కూడా ఉంది. కానీ ప్రస్తుతం పూజ హెగ్డే, రష్మిక మందన హవా నడుస్తున్న టైమ్ లో కాజల్ ను పట్టించుకోవటం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగానే ఏలేసింది కాజల్. కాజల్ ఈ జనరేషన్ లోని అందరి స్టార్ హీరోలతో నటించింది. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా హీరోయిన్ గా నటించింది. తమిళ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: