తెలుగు లో ఎక్కువగా ఇతర భాష హీరోయిన్లు ఎక్కువగా వస్తుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి.  అయితే మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, శృతిహాసన్ నటించిన సూర్య సినిమా 7th సెన్స్ తో తన సినిమా ప్రయాణం మొదలుపెట్టిన ధన్య ఇప్పటివరకు దాదాపుగా 23 సినిమాల్లో నటించింది.  ధన్య భాలకృష్ణ బెంగులూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి.  జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందని భావించినా.. పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళ్ లో కూడా నటిస్తుంది.  తెలుగు అమ్మాయే అయినా ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

 

రాజుగారి గది సినిమాతో మంచి పేరు తెచుకున్న ధన్య తరువాత కొన్ని సినిమాలు చేసింది. ధన్య భాలకృష్ణ  ఇప్పటి వరకు నటించిన చిత్రాలు పెద్దగా జనాదరణ పొందలేక పోయాయి.. దాంతో ఇతర సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు దక్కడం లేదని ఆవేదన చెందుతుంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ..  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు డైరెక్షన్ చేయాలనుందని అలాగే ఖచ్చితంగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమానే  చేస్తానని చెప్పింది ధన్య.  తనకు దర్శకురాలిగా మారి మంచి మూవీ తీయాలని ఉందని..  ఖచ్చితంగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమానే  చేస్తానని చెప్పింది ధన్య.

 

తాను బాలాజీ మోహన్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసానని చెప్పింది.  సినిమాలో తానే హీరోయిన్ అని అలాగే అందులో యాక్షన్, రొమాన్స్ లాంటి అని రకాల సీన్స్ ఉంటాయని వెల్లడించింది. ఇప్పటి వరకు తెలుగు తెరపై మహిళా దర్శకులు రావడం చాలా అరుదు అయినా.. మంచి విషయాలు అందుకున్నారు.  మరి ఈ అమ్మడి మనసులో కోరిక నెరవేరి మంచి హిట్ సినిమాలు తీయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: