దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సినిమా రంగంలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వరుసగా మూడు సినిమాలతో కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’ రీమేక్‌ లో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘వకీల్‌ సాబ్‌’ అంటూ ప్రకటించడం జరిగింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా సోషల్ మీడియాలో అయితే చాలా రికార్డు సృష్టించింది.

 

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ త్వరలోనే పూర్తి కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ మార్చి ఫస్ట్ వీక్ లోనే అయిపోవాలి. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రోగ్రాములు సడన్ గా పెట్టుకోవడంతో షూటింగ్ ఆలస్యం కావడం జరిగింది. దాదాపు రెండు వారాలు అదనపు టైం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో సమాచారం. అయితే ఇదే సమయంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉండగా...జాయిన్ అవ్వకపోవటం తో ఇలా అయితే కష్టం పవన్ కళ్యాణ్ అని చెప్పాడట క్రష్.

 

మొదటి షెడ్యూల్‌ ను పవన్‌ లేకుండానే పూర్తి చేసిన క్రిష్‌ గత కొన్ని రోజులుగా పవన్‌ కోసం ఎదురు చూస్తున్నా ఎటువంటి రెస్పాండ్ లేకపోవడంతో ఈ విధంగా క్రిష్ మాట్లాడినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ పాల్గొనే షూటింగ్ సమయంలో ఇతర నటులు కూడా వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం తో సినిమా యూనిట్ లో ఆందోళన నెలకొంది అని సమాచారం. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ డ్రామాగా ఉంటుందని.. రాజుల కాలంలో దొంగగా అది కూడా ఒక మంచి దొంగగా పవన్‌ కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: