టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ పెరిగిందన్న విషయం తెలిసిందే. ఏకంగా  బిగ్ బాస్ టైటిల్ విజేత గా  నిలవడంతో రాహుల్ క్రేజ్  అనూహ్యంగా పెరిగిపోయింది. రాహుల్ సిప్లిగంజ్  ఎన్నో పాటలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ సిప్లిగంజ్  పై ఓ పబ్  ఘర్షణలో  దాడి జరిగిన విషయం తెలిసిందే. పబ్ లో  రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరగడం సంచలనంగా మారిపోయింది. ఒక్కసారిగా మీడియా లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 

 పబ్ లో  కొంతమంది రాహుల్ సిప్లిగంజ్ తో గొడవపడి రాహుల్  పై బీర్ బాటిల్ కొట్టడంతో రాహుల్  సిప్లిగంజ్  గాయపడగా  రాహుల్ ను  ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న రాహుల్ సిప్లిగంజ్ దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు... తనతో గొడవ పడింది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడు అని అందుకే దర్పం చూపించుకోవడానికి అలా చేసాడు అంటూ ఆరోపిస్తున్నారు రాహుల్ సిప్లిగంజ్. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలంటూ ఏకంగా  కేటీఆర్ కు పోస్ట్  పెట్టాడు. ఇక తాజాగా ఓ వీడియో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాహుల్ సిప్లిగంజ్. 

 

 తను అనవసరంగా ఎవరి జోలికి వెళ్లనని... తనను గెలికిన వాళ్ళని మాత్రం ఎవరిని వదిలిపెట్టను అంటూ స్పష్టం చేశాడు. తన తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అంటూ తెలిపిన రాహుల్...  ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలి అని కోరాడు. అసలు పబ్ లో  తనపై దాడి జరగడానికి ముందు ఏం జరిగింది అనేది చాలా తక్కువ మందికి తెలుసని.. అందుకే సీసీ టీవీ ఫుటేజ్ ను  బహిర్గతం చేస్తున్నాను అంటూ రాహుల్ సిప్లిగంజ్ తెలిపాడు. పబ్ లో  గొడవ జరిగిన సమయంలో తనతో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారని ప్రత్యర్థులు ఎనిమిది మంది వరకు ఉన్నారని అయినప్పటికీ తాను ఎంతో సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకోగలిగాను అంటూ తెలిపాడు. తమతో ఇంకో ముగ్గురు ఉంటే ఇంకా మస్తు మజా  వచ్చేది అంటూ రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యానించాడు. నాపై దాడి చేసిన వాడి అన్న ఎమ్మెల్యే కావడంతో దర్పం చూపించుకోవడానికి ఇలా దాడి చేసాడు అంటూ రాహుల్ ఆరోపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: