స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి అలవైకుంఠ పురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాహుబలి రికార్డులను దాటేసి బన్నీ కెరీయ‌ర్ లోనే నెంబర్ వన్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నాడు. జులపాల జుట్టు బూచోడు లాంటి గడ్డంతో అల్లు అర్జున్ పూర్తి స్థాయి కడప కుర్రోడు గా మారిపోయాడు. ఇక రాయలసీమ భాష పై పట్టు కోసం వివరణ కూడా పెడుతున్నాడట. అల్లు అర్జున్ ఇటీవల వేస్తున్న ఏ ప్లాన్ అయినా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతోంది. 

 

అంతెందుకు సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాపై సవాలు చేసి మరీ హిట్ కొట్టి తన సత్తా ఏంటో చాటాడు. అయితే ఇప్పుడు సుకుమార్ సినిమా విషయంలో అల్లు అర్జున్ ప్లాన్ వర్కౌట్ ఆమాత్రం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి రాజమౌళి ఆర్ ఆర్ రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు పోటీగా వెళ్లే సాహసం బ‌న్నీ చేయ‌డ‌నే  చెప్పాలి. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య, ప్రభాస్ జాన్, ఆ వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలకు పోటీగా వెళ్లేందుకు బన్నీ సాహసించడం లేదట. అంటే సుకుమార్ సినిమాను బన్నీ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేసుకోవాలి. లేకపోతే వచ్చే స‌మ్మ‌ర్‌ వరకు ఆగాల్సిందే.

 

అయితే సుకుమార్ ఒక సినిమా తీయడానికి ఏడాదికి పైగా టైం తీసుకుంటాడు. డిసెంబర్ కల్లా సినిమాను ఫినిష్ చేసి రిలీజ్ చేయడం అనేది కలలో జరిగే పని మాత్రం కాదు.  మరి ఈ లెక్కన చూస్తే బన్నీ ప్లాన్లు ఈసారి అంతగా వర్కౌట్ అయ్యేలా కనపడటం లేదు. మ‌రి బ‌న్నీ ఏం చిరికి ఏం చేస్తాడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: