టాలీవుడ్ లో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి , టాక్సీవాలా మూవీస్ తో వరుస విజయాలు అందుకున్న హీరో విజయ్ దేవరకొండ ఇటీల వరుసగా అపజయాలు పొందుతున్నాడు.  నోటా, డీయర్ కామ్రేడ్ ల తర్వాత ఇటీవల రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్  చిత్రాలతో బాక్సాఫీస్ ఫ్లాప్ పొందాడు.  ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులు పడుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రం లో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.  హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది. 

 

ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.  ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కేటుగాళ్ళు బాగా తయారయ్యారు.  స్టార్ హీరో, హీరోయిన్ల పేర్లు చెప్పుకొని ఫేక్ అకౌంట్స్ తయారు చేసి మోసం చేస్తున్నారు.  తాజాగా విజయ్ దేవకొండ పేరు తో ఓ యువకుడు అమ్మాయిలను చీట్ చేసి వలలో వేసుకోవడం సంచలనం రేపింది.  ఈ విషయాన్ని ఫ్యాన్స్ ద్వారా తెలుసుకున్న విజయ్ దేవరకొండ స్వయంగా అతని సహాయకుడితో కేటు గాడితో చాటింగ్ చేసి మరి అతని గుట్టు బయట పెట్టాడు.  అంతే కాదు అతని మోసాన్ని పోలీసులకు స్వయంగా చూపించి కేసు పెట్టారు. 

 

దాంతో రంగంలోకి దిగి వెంటనే కలవాలి హైదరాబాద్ వచ్చేయి అని చెప్పడంతో నిజమేనని నమ్మిన మోసగాడు పోలీసులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పీఎస్ కు తరలించారు.  ఈ సందర్భంగా ఆ మోసగాడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ తిన్నారు.  ఒక్క విజయ్  దేవరకొండ పేరు మాత్రమే కాదు.. ఇతర సెలబ్రెటీల పేర్లు చెప్పి మోసాలు చేశాడట.  పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఇతను మరో ఇద్దరు హీరోల పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి పది మంది అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: