తెలుగు ప్రజల్లో జీవితాల్లో సినిమా అనేది కూడా ఒక భాగమే. మన ప్రేక్షకుల అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే సినీ జనాలను తమ కుటుంబం సభ్యులుగా భావిస్తుంటారు. అయితే సినిమా అనేది పురుషాదిక్య రంగం అన్న పేరు తొలినాళ్ల నుంచే ఉంది. కానీ అలాంటి రంగంలోనూ సత్తా చాటిన మహిళా మణులు ఉన్నారు. ఇప్పడే కాదు సినిమా తొలి తరం నుంచి తమదైన ముద్ర వేసిన మహిళలు ఉన్నారు.

 

అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే మహిళ భానుమతి రామకృష్ణ. స్టార్ హీరోలను సైతం గడగడలాడించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ. నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తరువాత సంగీత దర్శకురాలిగా, గాయనిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో సత్తా చాటారు. సుధీర్ఘ కాలంపాటు సినీ రంగంలో కొనసాగిన భానుమతి, తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భానుమతి ఇన్సిపిరేషన్‌తో ఆ కాలంలోనే దర్శకత్వం రంగంలోకి అడుగుపెట్టిన మహిళా మణులు సావిత్రి, విజయ నిర్మల.

 

అయితే నటిగా ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన సావిత్రి దర్శకురాలిగా ఆ స్థాయిలో రాణించలేకపోయారు. అందుకే ఎక్కువ సినిమాలను డైరెక్ట్‌ చేయలేదు. విజయ నిర్మాల మాత్రం దర్శకురాలిగా 40కి పైగా చిత్రాలను రూపొందించారు. అంతేకాదు అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ రికార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నారు. విజయ నిర్మల తరువాత ఆ స్థాయిలో సత్తా చాటిన మహిళా దర్శకురాలు మరొకరు లేరు.

 

అయితే వీరి ఇన్సిపిరేషన్‌తో చాలా మంది మహిళా దర్శకురాళ్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. జీవితా రాజశేఖర్, బి జయ, నందిని రెడ్డి, సుచిత్రా చంద్రబోస్‌ లాంటి వారు కూడా దర్శకురాళ్లుగా సత్తా చాటారు. మంజుల, శశికిరణ్‌, షాలిని రెడ్డి, సంజనా రెడ్డి లాంటి వారు దర్శకురాలిగా ఒక్కోసినిమాతోనే సరిపెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: