ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాం లోకి వచ్చాడని చెప్పొచ్చు. రామ్ ఎనర్జీని పూరి పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. అందుకే ఆ సినిమా ఇరగ ఆడేసింది. రామ్ సూపర్ హిట్టు కొడితే ఆ సినిమా రీ సౌండ్ ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ సినిమా వసూళ్లు చూస్తేఅర్ధమవుతుంది. ఆ సినిమా హిట్ జోష్ తో రామ్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ తడమ్ రీమేక్ గా రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల డైరక్షన్ లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా అమృత అయ్యర్ కూడా నటిస్తుంది.

 

ఇక ఈ సినిమా తర్వాత రామ్ మారుతి డైరక్షన్ లో సినిమా చేస్తాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ న్యూస్. ప్రతిరోజూ పండుగే సినిమా సక్సస్ తో మరోసారి తన సత్తా చాటిన మారుతి రామ్ కోసం ఓ మంచి కథ రాసుకున్నాడట. రీసెంట్ గా రామ్ ను కలిసి కథ చెప్పడం.. రామ్ ఓకే చేయడం అంతా జరిగిందట. త్వరలో ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. రామ్ కోసం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను రాశాడట మారుతి,

 

మారుతి డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. రామ్ మారుతి తప్పకుండా ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమా వెండితెర మీద అద్భుతాలు చేస్తుందని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కథల విషయాలో చాలా జాగ్రత్త పడుతున్న రామ్ మారుతి కథ బాగా నచ్చేయడంతో సినిమాకు సైన్ చేశాడట. ఈ సినిమా ఎవరు నిర్మిస్తారు. మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: