కరోనా (కోవిడ్ 19) చైనా నుంచి వచ్చిన అతి భయంకరమైన వైరస్.  ఇప్పటి వరకు చైనా నుంచి ఎన్నో వస్తున్నవులు దిగుమతి చేసుకున్న దేశాలు ఇప్పుడు కరోనాను కూడా అనూహ్యంగా దిగుమతి చేసుకున్నట్లే అయ్యింది.  ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చైనా ఇప్పుడు ఈ కరోనాకు మాత్రం మందు కనిపెట్టలేక పోతున్నారు. చైనాలోనే ఇప్పటి వరకు 3 వేల మందికి పైగా మరణాలు సంబంవించాయి.. 80 వేల కు పైగా ఈ రోగాన భారిన పడ్డట్టు సమాచారం.  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల మనుషులకే కాదు వాణిజ్య వ్యవస్థ కూడా డ్యామేజ్ అవుతుంది.  ముఖ్యంగా కరోనా బీభత్సానికి ఎగుమతి, దిగుమతులపై కూడా ప్రభావం పడుతుంది.

 

కరోనా అనేది వైరస్ తో రావడం వల్ల ఇది మనుషుల నుంచి ప్రబలుతుంది. అందుకే డాక్టర్లు ఎన్నో జాగ్రత్తలు సూచిస్తున్నారు.. ముఖ్యంగా ముఖానికి మాస్క్ లు ధరించి పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలిని చెబుతున్నారు.  అయితే కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు సిని ఇండస్ట్రీపై కూాడా పడింది.  ప్రపంచ వ్యాప్తంగా కొన్ని చిత్రాల రిలీజ్ ని వాయిదాలు వేసుకుంటున్నారు.. మరికొన్ని చిత్రాలు షూటింగ్ లు ఆపుతున్నారు.  తాజాగా ఈ కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు రజినీకాంత్ చిత్రంపై పడింది అంటున్నారు.  శివ దర్శకత్వంలో ‘అణ్ణాత్త’ అనే సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నారు. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తిసురేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

 

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘దర్భార్’ చిత్రం మంచి హిట్ టాక్ వచ్చినా.. కమర్షియల్ గా డబ్బులు మాత్రం రాబట్టలేక పోయిందని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు తమిళనాట బయ్యర్లు పెద్ద ఎత్తున గొడవ పెట్టుకోవడం.. రజినీకాంత్ జోక్యం చేసుకొని సర్దు బాటు చేయడం చేసినట్టు సమాచారం. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందో అన్న భయంతో చాలా మంది షూటింగ్స్ వాయిదా వేసుకుంటున్నారు.  తాజాగా  కోల్‌కతా, పూణెలలో కొన్ని సీన్లు చిత్రీకరించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ భయపెడుతుండడంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: