ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మణిరత్నం సినిమాలో నటించి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు మోపి ఉత్తమ నటిగా పేరుపొందింది. అంతర్జాతీయ మీడియా ఐశ్వర్యరాయ్ ని ఈ భూమి మీద నడిచిన వాళ్లలో అత్యంత అందమైన యువతిగా పేర్కొన్నారు. ఆమె ఇంగ్లీష్ మూవీస్ లో కూడా నటించి బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకుంది. కానీ తన కెరియర్ లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ చేసిన తప్పులు ఆమె ని ఇప్పటికీ బాధిస్తాయట. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుందాం.


1999 లో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ కలిసి నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్ విజయవంతం అయిన తర్వాత సంజయ్ లీలా బన్సాలీ వారిని బాజీరావ్ మస్తానీ సినిమా లో హీరో హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నారు. కానీ హమ్ దిల్ దే చుకే సనమ్ తరువాత సల్మాన్ ఖాన్ ఐశ్వర్యారాయ్ ని ఎంతో వేధించాడు కాబట్టి అతనితో కలిసి నటించేందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో బ్లాక్ బస్టర్ సినిమా అయిన బాజీరావ్ మస్తానీ లో దీపికా పడుకొనే రణ్ వీర్ సింగ్ నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రశంసలు పొందారు. ఒకవేళ ఈ సినిమాలో చేసేందుకు ఆమె అంగీకరించినట్లయితే ఆమెకు గొప్ప పేరు వచ్చేది.

 



అలానే భూల్ భూలేయా సినిమాలో నటించేందుకు ఆమె తిరస్కరించి మంచి హిట్ ని విద్యాబాలన్ కు వదులుకొని పశ్చాత్తాప పడింది. కుచ్ కుచ్ హోతా హై సినిమా లో కూడా ఆమె నటించడానికి సిద్ధం పడకుండా ఒక పెద్ద తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ మొదటిగా షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్ అని ఆ సినీ బృందం అనుకున్నప్పటికీ... ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. అయిననూ ఈ సినిమా పెద్ద హిట్ అయి ఐశ్వర్యరాయ్ ని మరోసారి ఆలోచించేలా చేసింది.

 

 

అమీర్ ఖాన్ నటించిన రాజా హిందుస్తానీ సినిమా లో ఆ సినీ డైరెక్టర్ ఐశ్వర్య రాయ్ ని తీసుకునేందుకు సంప్రదించగా... ఆమె అప్పటికే నాలుగు సినిమాల్లో నటిస్తుండగా ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. తర్వాత ప్రపంచ అందాల పోటీలో పాల్గొంది. ఏది ఏమైనా ఆమె రిజెక్ట్ చేసిన రాజా హిందుస్తానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆమె తన కెరియర్ లో మంచి మంచి ఆఫర్లను రిజెక్ట్ చేసి ఏదో ఒక సందర్భంలో అవి గుర్తుచేసుకొని బాధపడుతుందట. ఆమెకు ఎంత పేరు వచ్చినా చాలా వినయంగా ఉండటం ఆమె యొక్క మంచి గుణం అని చాలా మంది చెబుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: