యంగ్ హీరో సుధీర్ బాబు కు మంచి నటుడు అన్న పేరున్నా ఇప్పటి వరకు అతడు నటించిన సినిమాలు ఏమి సూపర్ హిట్ అవ్వకపోవడంతో సుధీర్ బాబుకు నటుడుగా గుర్తింపు వచ్చింది కానీ ఇంకా క్రేజీ హీరోగా సెటిల్ కాలేకపోతున్నాడు. దీనికితోడు సుధీర్ బాబు సినిమాల ఫంక్షన్స్ కు మహేష్ వచ్చి ప్రమోట్ చేస్తున్నా మహేష్ అభిమానులు మాత్రం సుధీర్ బాబును పూర్తిగా గుర్తించడం లేదు.


దీనితో ఇతడి కెరియర్ అంతంత మాత్రంగానే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈనెల ఉగాది రోజున విడుదల కాబోతున్న ‘వి’ మూవీ పై సుధీర్ బాబు చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో నాని నెగిటివ్ పాత్రలో నటిస్తుంటే సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. 


ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ నాని నటించిన 25వ సినిమా కావడంతో ఈ మూవీ ప్రమోషన్ ఫోకస్ అంతా నాని పై ఉండే విధంగా నాని పిఆర్ టీమ్ ఇప్పటికే రకరకాల ప్రమోషన్ ప్లాన్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమోషన్ ప్లాన్ లో ఎక్కడా సుధీర్ బాబు ప్రస్తావన లేకుండా అంతా నాని చుట్టూనే హైలెట్ చేస్తూ నాని పిఆర్ టీమ్ పక్కాగా వ్యవహరిస్తోంది అన్న లీకులు సుధీర్ బాబు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.


దీనితో అసహనానికి లోనైన సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దృష్టికి తనకు అన్యాయాన్ని తీసుకు వచ్చినట్లు టాక్. ‘వి’ మూవీ ఒక మల్టీ స్టారర్ గా నిర్మించిన పరిస్థితులలో ఇప్పుడు ఆ సినిమాను కేవలం నాని సినిమాగా ప్రమోట్ చేయడం ఏమిటి అంటూ సుధీర్ బాబు తీవ్ర అసహనంతో ఇంద్రగంటి మోహన్ కృష్ణను అడిగినట్లు తెలుస్తోంది. దీనితో ఎలర్ట్ అయిన ఇంద్రగంటి నాని దృష్టికి ఈ విషయాలను తీసుకు వెళ్ళి సుధీర్ బాబుకు కూడ సమాన ప్రతినిధ్యం ఉండేలా ప్రమోషన్ కార్యక్రమాలు ఉండాలి అని చెప్పడంతో నాని ఇగో దెబ్బతిని ఈ మూవీకి సుధీర్ బాబు హీరోనా లేక తాను హీరోనా అంటూ ఇంద్రగంటి వద్ద నాని అసహనానికి లోనయ్యాడు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: