తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అయిన దొరబాబు, పరదేశిలు మొన్న విశాఖలో ఓ వ్యభిచారం కేసులో పట్టుబడ్డారు.  అయితే జబర్దస్త్ దొరబాబు ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి రసికుడ్నే అని నిరూపితం చేశాడు.    విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. అప్పటి నుంచి టాలీవుడ్ లో ఈ విషయం సంచలనంగా మారిపోయింది.  అంతే కాదు ఈ విషయంలో మల్లెమాల యాజమాన్యం హైపర్ ఆది.. ఇతర జబర్ధస్త్ సభ్యులకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇలాంటి వ్యవహారాలతో ఇబ్బందులు తీసుకు వచ్చి జబర్ధస్త్ ఇమేజ్ దెబ్బ తీయోద్దని సిరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

 

అయితే జబర్ధస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో ఉంటారు దొరబాబు.  దొరబాబును మొదటి నుంచి ప్రోత్సహించి అతడికి  పేరు తేవడంలో హైపర్ ఆది కృషి ఉంది... మొదటి నుంచి స్కిట్స్ లో దొరబాబును స్త్రీలోలుడిగా చూపించేవాడు. అదే నిజమైంది. ఇది పెద్దగా హైలెట్ కావటంతో తలపట్టుకున్నాడట ఆది. అయితే మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొన్న హైపర్ ఆది టీమ్ మెంబర్స్ వివరణ కోరింది.. అయితే దీనిపై హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ వేడి చల్లారేదాకా అంటే రెండు వారాల పాటు ...ప్రస్తుతానికి దొరబాబుని, పరేదేశీని ప్రక్కన పెడతాను అని చెప్పినట్లు సమాచారం.

 

లీడ్ లో ఉన్న కమెడియన్స్ పక్కకు తప్పుకుంటే కాస్త ప్రబావం పడొచ్చు.. కానీ వారు చేసిన వెధవ పనికి ఆ మాత్రం పనిష్ మెంట్ ఉండాలని ఆయన అంటున్నారట. కాకపోతే టీమ్ లో ఇద్దరు వెళ్లిపోతే మళ్లీ అలాంటి వాళ్లను తయారు చేసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. అందులోనూ హైపర్ ఆది రాసే పంచ్ లకు పరదేశి ...రచనా సహకారం అందిస్తున్నాడు. అయితే తెర వెనక ఉండి చేసే స్క్రిప్ట్ విషయం కనుక పెద్దగా పట్టించుకోరు.  ఏది ఏమైనా హైపర్ ఆది నిర్ణయంతో దొరబాబు పూర్తిగా పక్కన బెడితేనే బాగుండు అని అంటున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: