శ్రీరెడ్డి... ఈ పేరుకి మళ్ళీ అంత పబ్లిసిటీ అవసరం లేదనుకుంటా..! దీనికి కారణం టాలీవుడ్‌ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద దుమారం లేపింది ఈవిడే కాబట్టి. ఎవరని తేడా లేకుండా అందర్నీ ఒక రౌండ్ వేసుకుంది. టాలీవుడ్‌ లోని పెద్దపెద్ద సినీ ప్రముఖలని టార్గెట్ చేస్తూ మీటూ ఆరోపణలు చేసింది. ఇందులో ముఖ్యంగా దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్‌ తనను మోసం చేసి వాడుకున్నాడని, వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి పెద్ద సెన్సషనే క్రియేట్ చేసింది. అయితే అదంతా ఒకప్పుడు, ఇప్పుడు శ్రీరెడ్డి టాలీవుడ్ ని వదిలి కోలీవుడ్‌ కి మకాం మార్చేసింది. అక్కడే అడపాదడపా చిత్రాలను చేస్తూ కాలం నెట్టుకొస్తునదనుకోండి.

 

IHG


ఇది ఇలా ఉండగా మళ్ళీ రెండు మూడు వారాలుగా శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా న్యాచురల్ స్టార్ నానిపై మరోసారి ఫైర్ అయ్యింది. ఇది కాకుండా ఈ మధ్య రాకేష్ మాష్టర్ తనను డిన్నర్‌ కు పిలిచాడని గతంలో ఏదో ఒక ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంపై రాకేష్ మాష్టర్ తాజాగా ఆయన స్పందించాడు. ఇదే క్రమంలో శ్రీరెడ్డిపై నిప్పులు చెరిగాడు. దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడమని అంటూ రాకేష్ మాష్టర్ ఓపెన్ ఛాలంజ్ చేశాడు. ఇలా మొదలైన గొడవ నిజానికి రెండు వారాల నుంచి ఏదో ఒక రూపంలో ముందుకు సాగుతానే ఉంది.

 

IHG

 

ఇది ఇలా ఉంటే నాని నిర్మాతగా విశ్వక్‌ సేన్ హీరోగా వచ్చిన సినిమా "HIT". ఈ సినిమాకు విమర్శల ప్రశంసలు కూడా దక్కాయి. హిట్, సూపర్ హిట్ దిశగా వెళ్లే సూచనలున్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఇదే సమయంలో శ్రీరెడ్డి ఈ మూవీపై ఓ పోస్ట్ చేసింది. అదేమిటంటే హిట్టా.. ఫట్టా అంటూ తన ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఇంతటితో ఆగకుండా ఆ తరువాత కొంత సమయానికి "నూని గాడు ఓమ్ భూమ్ ఫట్ అంటగా" అంటూ మరో పోస్ట్ ని చేసింది శ్రీరెడ్డి. HIT సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, శ్రీరెడ్డి మాత్రం ఇలా నెగెటివ్‌ గా తనదైన శైలిలో కామెంట్ కొనసాగించింది. అంతేకాకుండా ఇంకో పోస్ట్‌లో "డెవిల్ ఈజ్ బ్యాక్" అంటూ మరో పోస్ట్ చేసింది. వీటన్నిటిని చూస్తే శ్రీరెడ్డి మళ్లీ తన ఫామ్‌ లోకి వచ్చినట్టు క్లియర్ గా అగుపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: