టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రంగస్థలం లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ తో  పాటు క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ కాస్త నిరాశ పరిచినప్పటికీ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమాలో రామ్ చరణ్ నటిస్తుండడం రామ్ చరణ్ కెరీర్ కి ఎంతో ప్లస్ పాయింట్ కానుంది. మామూలుగానే రాజమౌళి సినిమాలు అంటే  పాన్ ఇండియా లెవెల్లో ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి హిట్ సాధిస్తూ ఉంటాయి  రాజమౌళి సినిమాలు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రామ్ చరణ్ మార్కెట్ ను ఎక్కడికో తీసుకెళ్లనుంది. 

 

 అయితే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్  సినిమా తర్వాత ఎవరితో సినిమాను సైన్ చేయబోతున్నాడని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్  ఒక్కసారిగా పెరిగి పోతుంది. ఆ క్రేజ్ ను  అలాగే మెయింటైన్ చేయాలి అంటే ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ తాజాగా చరణ్ ఓ సాహసం  చేస్తున్నట్లు సమాచారం. ప్రదీప్ అనే ఓ కొత్త కుర్రాడు వినిపించిన స్క్రిప్ట్ ను  రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ స్క్రిప్ట్ పై రామ్ చరణ్ ఎన్నో రోజులుగా డిస్కషన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ స్క్రిప్ట్ విషయంలో బెటర్ మెంట్  చేయడానికి అటు రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా పలు సలహాలు కూడా వినిపించాడట. 

 


 ఒకవేళ అన్నీ కుదిరితే ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఈ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అని బలమైన ప్రచారం జరుగుతుంది.ఒకవేళ ఇదే నిజమయితే కనుక రామ్ చరణ్ రిస్కు తీసుకున్నట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోతుంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు రామ్ చరణ్. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ కొత్త దర్శకులతో సినిమాలు చేయాలనుకుని సాహసం చేస్తున్నాడు అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. మరి రామ్ చరణ్  మెచ్చే విధంగా యువ దర్శకుడు అంత విభిన్నమైన కథ వినిపించాడ అన్న దానిపై కూడా ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: