గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు రాలిపోతున్నారు. దాసరి నారాయణరావు, హరికృష్ణ, గొల్లపూడి మారుతీరావు లాంటి దిగ్గజాల మరణాలతో తీవ్ర శోకం లో ఉన్న సమయంలో తాజాగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మరణించడం అందరికీ షాక్ కి గురిచేసింది. చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించి చాలా సందర్భాలలో కీలక సమయాలలో అండగా ఉంటూ రాణించిన పసుపులేటి రామారావు మరణం పట్ల సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో మరో సీనియర్ నటుడు తెలుగులో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన సీనియర్ యాక్టర్ జనార్దన్ రావు అనారోగ్యం కారణం తో మరణించడం జరిగింది. మార్చ్ ఆరో తారీఖున ఉదయం చెన్నై లో ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు.

 

దాదాపు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ లోనే ఉన్నా జనార్దన్ రావు జూనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలామంది ఇండస్ట్రీ స్టార్ హీరోలందరితో కలసి నటించిన దాఖలాలు ఉన్నాయి.   కొన్ని వందల సినిమాల్లో నటించిన జనార్దన్ రావు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సినిమాలో ఓ సీన్‌లో మనకు కనబడతారు.

 

గవర్నమెంట్ ఆఫీస్‌లోకి రౌడీలు వచ్చినపుడు ఎన్టీఆర్ మాట్లాడేది ఈయనతోనే.సౌత్ ఇండియన్ ఫిలిం ఎంప్లాయ్ ఫెడరేషన్‌లో జాయింట్‌ సెక్రటరీగానూ, కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. గుంటూరు జిల్లాలోని పొనిగళ్ల గ్రామం జనార్ధన్‌రావు ఈయన స్వస్థలం. 1000కి తెలుగు సినిమాలతో పాటు, సిరీయల్స్‌లో కూడా నటించారు. అయితే ఈయన చనిపోయాడన్న వార్త వినగానే కింగ్ నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యారట. జనార్దన్ రావు తో చాలా సినిమాల్లో నటించడం తో పాటు ఆయన మంచి వ్యక్తిత్వం గల మనిషి కావడంతో నాగార్జున ఎమోషనల్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇదే సందర్భంలో మోహన్ బాబు, చిరంజీవి వంటి హీరోలు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: