1983 సంవత్సరం నుండి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తున్న ఓ బడా నిర్మాత ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర మానసిక వేదన పడుతున్నాడు. మొన్నీమధ్య సూపర్ క్రేజ్ ఉన్న హీరో సినిమాని నిర్మించాడు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి అతనిని కోలుకోలేని దెబ్బతీసింది. ఇతను మూడు దశాబ్దాల క్రితం ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సినిమాలను నిర్మించి సక్సెఫుల్ ప్రొడ్యూసర్ అనే పేరు ని సంపాదించాడు. ఓ హాస్యనటుడి సినిమా తో పాటు బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్ద్, రెబల్ స్టార్ ప్రభాస్ ల సినిమాలను కూడా నిర్మించాడు కానీ అవి మాత్రం డిజాస్టర్ లాగానే మిగిలిపోయాయి.

 

 

2 సంవత్సరాల క్రితం మెగా ఫ్యామిలీ లోని ఓ కుర్ర హీరో సినిమాని తెరకెక్కించినప్పటికీ అది కూడా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయి అతనిని ఆర్థిక సంక్షోభం లోకి నెట్టి పారేసింది. వాస్తవానికి 2000-2020 సంవత్సర మధ్య కాలంలో అతను ఎక్కువగా నాసిరకం సినిమాలనే నిర్మించాడు. ఐతే అవన్నీ బడ్జెట్ డబ్బులను కూడా బాక్సాఫీస్ వద్ద వసూలు చేయలేకపోయాయి. చివరికి ఆ నష్టాలన్నిటినీ పక్కన పెట్టేసి తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన హీరోతో సినిమా తీసి హిట్టు కొట్టి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు... సూపర్ డూపర్ క్రేజ్ ఉన్న హీరో సినిమా కూడా అట్టర్ ప్లాప్ టాక్ ని సంపాదించి అతనికి నష్టాలనే మిగిల్చింది. 

 


సినిమా పరాజయంతో అతను తన ఆశలన్నీ వదిలేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళినట్టు సినీ వర్గాలలో ప్రస్తుతం చర్చనీయాంశమయింది. ఒకప్పుడు ఒక స్టార్ హీరో కి ఎన్నో హిట్లను అందించిన ఈ బడా నిర్మాత కి డేట్స్ ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇవ్వడంతో అతను చాలా కృంగిపోయాడనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా అతని బ్యానర్ కింద ప్రస్తుతం నటించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం చాలా బాధాకరం. ఒక్క హిట్ కొడితే తన అప్పులన్నీ పోతాయని అతను ఎంతగా తపన పడినా తను అనుకున్నట్లు ఏదీ జరగక చాలా దారుణ పరిస్థితిలో అతడు ఉన్నాడని సినీ వర్గాలు గుప్పుమంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: