జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ వాయిదా పడిందా...? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముంచుకి వస్తుంది. దిల్ రాజు, బాలీవుడ్ స్టార్ నిర్మాత బోని కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉంది చిత్ర యూనిట్. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. 

 

సోషల్ మీడియాలో కూడా ఆ లుక్ ఒక రేంజ్ లో వైరల్ అయింది అనే చెప్పుకోవచ్చు. దాదాపు రెండేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి అని చెప్పవచ్చు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ గా నటిస్తున్నారు. దీనితో ఆయన ఏ విధంగా నటిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక టాలీవుడ్ జనం కూడా ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే ఆసక్తిగా వింటున్నారు. శుక్రవారం సినిమా మొదటి పాట ప్రోమో ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

 

ఈ సినిమాలో తొలి పాటను ఆదివారం ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక కీలక వార్త బయటకు వచ్చింది. సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం ఎవరు అనేది తెలియకపోయినా ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని, చిత్ర నిర్మాణం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి కారణంగా సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని సినిమా విడుదల గురించి త్వరలో కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: