ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో అందరికి తెలిసిందే.. అయితే ఎంతోమంది సెలెబ్రిటీలు ఈ షోకి గెస్ట్ గా వచ్చి స్టేజ్ మీద పేల్చే ఆ స్కిట్లను చూసి ఎంజాయ్ చేస్తారు. మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం తమకున్న మక్కువను చూపిస్తూ.. ఏకంగా స్కిట్ లో ఒక పాత్రనే పోషిస్తారు. అయితే వచ్చేవారం ప్రోమో లో ముక్కు అవినాష్ స్కిట్ లో ఒక ముసలాయన కనిపించారు.

 


కాగా., సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు లో నటించారు. రమణ లోడ్ ఎత్తాలిరా.. అనే డైలాగ్ ప్రస్తుతం బాగా పాప్యులర్ అయింది. అయితే ఈ డైలాగ్ ను చెప్పింది ఈ ముసలాయన దీంతో ఫుల్ ఫేమస్ అయ్యారు. కానీ.. ముసలాయన ఈ  సినిమా కంటే ముందే కొన్ని సినిమాలలో చేశారు. కానీ ఆ పాత్రలకు గుర్తింపు రాకపోవటంతో ఆయన్ను గుర్తించలేదు.

 


ముసలాయన అసలు పేరు కుమనన్ సేతురామన్ .. అయితే ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. కాగా., 1984లోనే వైజాగ్‌ కు వచ్చి సెటిల్ అయిపోయాడు. కుమనన్ భార్య పేరు మహాలక్ష్మి. ఈయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే సినిమాలపై మోజుతో హైదరాబాద్ కి వచ్చాడు. ఇక్కడ చాలా ఏళ్ల పాటు ట్రై చేసాడు కానీ అదృష్టం కలిసిరాలేదు. కాగా., అల్లుడు శీనులో బాబాగా వచ్చేది కూడా ఈయనే.. ఆ తర్వాత సైరాలో నిహారిక తండ్రిగా నటించాడు. కానీ 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసాడు.. కానీ ఆ సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తింపు తెచ్చిన పాత్ర లేదు. 

 


తాజాగా ముక్కు అవినాష్ స్కిట్‌ లో ఈయన కనిపించాడు. రమణ లోడ్ ఎత్తాలిరా అంటూ ఆయన చెబుతుంటే.. నన్ను ఎత్తరా అంటూ మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ కుమనన్ కామెడీ చేసారు. ఈ స్కిట్ బాగానే పేలేలా కనిపిస్తుంది. కానీ.. వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో రమణా లోడ్ ఎత్తాలిరా డైలాగ్ బాగా హైలైట్ అయింది. ముందు చెప్పినట్లుగానే జబర్దస్త్ లో ఇప్పటికే చాలా మంది నటులు కనిపించారు. మరిప్పుడు సేతురామన్ ఎలాంటి సందడి చేస్తాడో.. ప్రేక్షకులను ఎలా అకట్టుకుండతో.. ఎలా నవ్విస్తాడో చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: