ప్రస్తుతం సినిమా బిజినెస్ కు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగపడుతోంది. సినిమా రిలీజ్ కు ముందే జరిగే బిజినెస్ తో నిర్మాతకు మంచి ఆదాయం కూడా వస్తోంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ఈ రంగంలో టాప్ లో ఉన్నాయి. దీనిని గుర్తించిన టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా పేరుతో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. గత జనవరిలో యాప్ ప్రారంభించి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించిన విషయం తెలిసిందే.

 

 

ఈ యాప్ ను మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. తన ఇంట్లోని సూపర్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ ను ఇందుకు ఉపయోగిస్తున్నాడని అంటున్నారు. బన్నీతో ఓ ప్రమోషనల్ సాంగ్ ను ఆహా కోసం తీస్తే ప్రజల్లోకి చేరుతుతుందని ప్లాన్ వేశాడట. ఇందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సంప్రదింపులు జరిపాడనే టాక్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. బన్నీత్రివిక్రమ్ లతో తీసే కమర్షియల్ సాంగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఆహా లో సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు రానున్నాయని తెలుస్తోంది.

 

 

ఇందుకు బన్నీ సాంగ్ తో ప్రమోషన్ బాగా ఉపయోగపడుతుందని అల్లు అరవింద్ ప్లాన్ గా ఉందంటున్నారు. బన్నీత్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన మూడు సినిమాల్లో రెండు సూపర్ హిట్లు కాగా అల.. వైకుంఠపురములో మాత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీంతో వీరి కాంబోలో పాట వస్తే మరింత ఆకర్షణీయంగా వస్తుందని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి ఈ వార్త ఫిలింనగర్లో బాగా రౌండ్ అవుతోంది. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: