హీరో, డైరెక్టర్ మరియు కొరియోగ్రాఫర్ అయినా రాఘవ లారెన్స్ కి సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరుంది. అనాధ పిల్లలను ఆదుకోవడంలో మరియు పేద వాళ్లకి గుండె జబ్బుల ఆపరేషన్ చేస్తూ సొంత ఖర్చుతో ఎంతో చారిటీ చేసే లారెన్స్ అంటే చాలామంది గౌరవిస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోలందరికీ కొరియోగ్రాఫర్ చేసిన లారెన్స్ ప్రస్తుతం తమిళ సినిమా రంగంలో చాలా బిజీగా ఉన్నాడు. ఒక పక్క కొరియోగ్రాఫ్ చేస్తూ మరో పక్క హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఇటువంటి అన్న కలిగిన లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ తెలంగాణరాష్ట్రం వరంగల్ కి చెందిన దివ్య అనే అమ్మాయిని వేధింపులకు గురిచేస్తూ ఆమె ఇంటికి వెళ్లి ఆమెను ఇంట్లోంచి నెట్టివేసే విధంగా వ్యవహరించడం జరిగిందట.

 

 ఆ అమ్మాయి ఫోన్ టాపింగ్ చేసి ఆ మాటలను రికార్డు చేసి వేధిస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా నేరుగా ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరింపులు కూడా చేయడంతో ఆమె ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇండస్ట్రీలోనే జూనియర్ ఆర్టిస్టుగా దివ్య పనిచేయడంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అయింది లారెన్స్ తమ్ముడు వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలోనే దివ్య అతనిపై కేసు పెట్టగా … కేసు పెట్టిన స్టేషన్ కి సంబంధించిన పోలీసులు అతని తో కుమ్మక్కయి తిరిగి రివర్స్ కేసులో తనపై పెట్టి జైలుకు పంపించారని ఆమె తెలిపింది.

 

దీంతో ప్రస్తుతం లారెన్స్ తమ్ముడు తో తనకి ప్రాణభయం ఉందని హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ అదే విధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవటంతో తన తమ్ముడు ఆ విధంగా చేశాడని లారెన్స్ పిచ్చ కోపం వచ్చి డైరెక్టుగా చెన్నై నుండి హైదరాబాద్ రావడం జరిగిందట. ప్రస్తుతం కేసుకు సంబంధించి విషయాలన్నీ తెలుసుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా… సెటిల్మెంట్ దిశగా లారెన్స్ వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క తనకు పోలీసులు న్యాయం చేయకపోతే కెసిఆర్ వద్దకు వెళ్తానని సదరు మహిళ మీడియాకి తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: