ప్రముఖ కమెడియన్, మాజీ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ఎంతో కష్టపడి సినిమాల్లో మంచి స్థాయికి చేరుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలో వైసీపీ పార్టీకి సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన పృథ్వీని ప్రభుత్వం ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించింది. కానీ ఒక మహిళతో పృథ్వీ మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పృథ్వీ పదవికి రాజీనామా చేశాడు. 
 
ఈ వ్యవహారంలో పృథ్వీ నిజంగా తప్పు చేశాడని కొంతమంది నమ్ముతుండగా ఎవరో కుట్రపూరితంగా పృథ్వీని ఇరికించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మరోసారి పృథ్వీ ఆడియో టేప్ వివాదం గురించి స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో టేప్ ఫేక్ అని పృథ్వీ అన్నారు. ఎవరో కుట్రపూరితంగా కావాలని ఇదంతా చేశారని చెప్పారు. 
 
వైసీపీ పార్టీకి పదకొండేళ్లు తాను సేవలందించానని పృథ్వీ వ్యాఖ్యలు చేశారు. తన కృషిని గుర్తించి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. ఎవరో తనకు మంచి గుర్తింపు వస్తుందనే అక్కసుతో ఇదంతా చేశారని చెప్పారు. ఆడియోటేప్ వల్ల తన పదవితో పాటు పరువు కూడా పోయిందని చెప్పారు. అందువల్లే సోషల్ మీడియాకు తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు. 
 
ప్రముఖ న్యూస్ ఛానెల్ లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరైన పృథ్వీ తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో ఏ ఛానెల్ లో తాను ఇలా కన్నీళ్లు పెట్టుకోలేదని చెప్పారు. తన జాతకం ప్రకారం తనను ఇబ్బంది పెట్టిన వాళ్లు ఎవరూ బతికిలేరని అన్నారు. ఈ మాట తాను వెంకటేశ్వర స్వామి సాక్షిగా... కుటుంబ సభ్యుల సాక్షిగా చెబుతున్నానని చెప్పారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: