అమితాబ్ లివింగ్ లెజెండ్. మొత్తం భారత దేశ చలన చిత్ర పరిశ్రంలో ఆయన అద్భుతమైన నటుడు. ఎన్నో హిట్లు, సూపర్ స్టార్ డంతో ఇప్పటికీ తన కీర్తి కాంతులను అలా పంచుతూనే ఉన్నాడు. అమితాబ్ లో ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. ఆయనకు ఎప్పటికి ఏది చేయాలో తెలుసు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగే నటుడు. అంతే కాదు. కాలానికి తగినట్లుగా తనను మౌల్డ్ చేసుకుని మహానటుడిగా ఇప్ప‌టికీ కీర్తిని గడిస్తున్నాడు.

 

మరి ఆయనలా మొత్తం ఆలోవర్ ఇండియాలో హీరోలు కనిపించరు. అయితే స్టార్ డంతో అమితాబ్ తో పోటీ పడగల వారు సౌత్ లో రజనీకాంత్, చిరంజీవి ఉన్నారు. ఇక రజనీకాంత్ వరకూ తీసుకుంటే ఏడుపదుల వయసులో కూడా హీరో వేషాలు వేస్తున్నాడు. ఆయన ఓ  పక్కన హీరోయిజం చూపిస్తున్నా వయసుకు తగిన పాత్రలూ వేస్తున్నాడు.

 


తెలుగులో చిరంజీవి ఇంకాస్తా ముందుకు వెళ్ళి రోమాన్స్ ని కూడా  పండిస్తున్నాడు. ఆయన వయసు ఇపుడు 65  ఏళ్ళు. ఆయన టాలీవుడ్ కి లెజెండరీ పర్సనాలిటీ. అయితే చిరంజీవి ఇప్పటికీ హీరోయిన్లు, సాంగులు అంటూ దూకుడుగా సాగడం పట్ల కొన్ని విమర్శలు ఉన్నాయి. చిరంజీవిలో గొప్ప నటుడు ఉన్నాడు. ఆ నటుడు కేవలం సాంగ్స్ కే పరిమితం కాకూడదని అందరి కోరిక.

 

ఆయన కాలానికి తగినట్లుగా మంచి పవర్ ఫుల్ రోల్స్ వేయాలని కోరుకుంటున్న వారు కూడా పెరుగుతున్నారు. వీలైతే మల్టీ స్టారర్ మూవీస్ లో కనిపించాలని కూడా కోరుకుంటున్నారు. చిరంజీవి తన వయసుకు తగిన పాత్రలలో మెప్పిస్తే పదికాలాల‌ పాటు మెగా ఇమేజ్ కి తిరుగు ఉండదని కూడా అంటున్నారు.

 

చిరంజీవి 152 సినిమాకు కూడా హీరోయిన్ సమస్య రావడంతోనే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. మరో వైపు చిరంజీవి ఈ వయసులో ఫైట్లు, డ్యాన్సులు అంటూ యువ హీరోలతో పోటీ పడడం వరకూ బాగానే ఉన్నా హీరో అంటే కధను నడిపించేవాడిగా కూడా ఉండొచ్చు. ఈ వయసులో రిస్క్ ఎందుకు అని సలహా ఇస్తున్న వారు కూడా ఉన్నారు. ఎటూ కొడుకు రాం చరణ్ సూపర్ స్టార్ గా అందుకొచ్చాడు. అందువల్ల చిరంజీవిలోని అసలైన నటుడిని ఇపుడు వెలికితీయాలని సద్విమర్శలే వస్తున్నాయి. మరి మెగాస్టార్ ఏమంటారో.
 

మరింత సమాచారం తెలుసుకోండి: