ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎంతగా బయపెడుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చైనా నుంచి మొదలైన ఈ మహమ్మారి  ఇప్పుడు మనుషుల ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తుంది. ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల సినిమా ఇండస్ట్రీ పై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.  ఇప్పటికే హాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఇప్పటికే నిరవదిక వాయిదా వేసుకుంటున్నారు.  మరోవైపు షూటింగ్స్ కూడా క్యాన్సల్ చేసుకుంటున్నారు.  స్టాక్ మార్కెట్ నుంచి ప్రతి ఒక్క బిజినెస్ పై ఎంతో కొంత ప్రభావం చూపుతూనే ఉంది. 

 

ఇలా మూవీ ఇండస్ట్రీపై పడుతున్న ఎఫెక్ట్ తో కోట్ల నషటం వస్తుంది.  ఇప్పటికే జేమ్స్ బాండ్, మిషిన్ ఇంపాసిబుల్ లాంటి హాలీవుడ్ సినిమాలకు ఎఫెక్ట్ పడింది.  సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా క్యాన్సల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక సల్మాన్ ఖాన్ కూడా కరోనా కు బయపడి వెనుకడుగు వేయక తప్పలేదు. నెక్స్ట్ రాధే సినిమా కోసం థాయిలాండ్ వేళ్ళాల్సిన సల్మాన్ వెంటనే షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో ఆ సినిమా రిలీజ్ కూడా మరీంత ఆలస్యం అయ్యేలా ఉంది. 

 

ఆలస్యం అయినా పరవాలేదు.. ప్రాణాల కన్నా గొప్పది కాదని అంటున్నారు ఫ్యాన్స్. సినిమా షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తూ వస్తున్న సల్మాన్ కి థాయ్ ల్యాండ్ షెడ్యూల్ పూర్తవ్వకవడం కొంత  సమయం వృధా అవుతుందని భావిస్తున్నారు.  అయితే సల్మాన్ మాత్రమే కాదు .. ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ ఇదే బాట పడుతున్నారు.  ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రాణాలు పోతున్నాయి.. అయితే దీనికి మందు ఇప్పటి వరకు కనిపెట్టక పోవడం వల్ల తగు జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఇక థాయిల్యాండ్ లో కూడా కరోనా వైరస్ ఇప్పుడిపుడే వ్యాప్తి చెందుతుంది. ఇటీవల 50 మందికి అక్కడ కరోనా భారిన  పడిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: