అందం ఉండాలి. అది కళ్ళకు విందుగా కూడా ఉండాలి. ఒంపులు సొంపులు చంపుకు తినాలి. రంపపు కోత పెట్టాలి. అపుడేగా ఏ కాలం తెలియనిది. ఉన్న టైమంతా అయిపోయేకాలమయ్యేది. నభో నభవిష్యత్తు ఈ అందం అనిపించేది. ఆమె పేరు నభా నటేష్. సొగసు సెగలతో పొగపెట్టించడంలో శభాష్ అనాల్సిందే.

 

ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ తో ఈ మాస్ మసాల అందం టాలీవుడ్లో బాగానే తిష్ట వేసుకుంది. చాన్సులు వెల్లువలా రాకపోయినా ఆమె నాటీ బ్యూటీ మాత్రం కుర్రకారు కళ్ళను కట్టేసుకుంది. నభా ఏమి నీ ప్రతిభ అనని యువ గుండె లేదుగా.

 

ఇదిలా ఉండగా నభా చేతిలో ఇపుడు రెండు మీడియం రేంజి హీరోల సినిమాలు  ఉన్నాయి. అందులో ఒకటి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పక్కన సోలో బతుకే సో బెటర్ మూవీ అయితే. మరోటి బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన జోడీగా.

 

ఈ సినిమాల కంటే కూడా నభా ఇపుడు ఇన్స్టాగ్రాం ద్వారా కుర్ర హ్రుదయాలను కొరికేసే పని మొదలెట్టింది. పూటకో ఫోజుగా సెక్సాంగిల్ తో గిలిగింతలు  పెడుతోందిట. దాంతో నెట్టింట విస్త‌రి వేసుకుని ఆకలి కళ్ళతో నభా పిక్స్ కోసం అలా యూత్ అంతా పోగవుతున్నారుట.

 

ఆమె పిక్స్ పెట్టడమే ఆలస్యం హాట్ హాట్ గా స్వీట్ గా కామెంట్స్ రాస్తూ అందులోనే తనివి తీరని ఆనందం  పొందుతున్నారుట. ఇక గ్లామరసం ఒలికిస్తూ నభ తనకు ఎవరూ సాటి పోటీ లేరని చాటి చెబుతోంది. ఇలా ఆటాడుకుంటూ అల్లాడిస్తున్న ఈ బెంగుళూరు అమ్మడు వెచ్చగా చిచ్చు పెడుతోందిట. 

 

అయినా నభా అంటే అదో సరదా. ఆమెకు నెట్టింట ఫ్యాన్స్ బోలెడు మంది ఉన్నారు. వారిని కాపాడుకుంటూ అందంతో వేటాడడం ఎలాగో నభాకు మాత్రమే తెలిసిన విద్య.

 

మరింత సమాచారం తెలుసుకోండి: