తమిళ స్టార్ హీరో విజయ్ - ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నచిత్రం మాస్టర్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  జరుపుకుంటుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఈనెల 15న గ్రాండ్ గా జరుపనున్నారు. కోలీవుడ్ లో విజయ్ సినిమాల ఆడియో లాంచ్ ఈవెంట్ లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది..  విజయ్ స్పీచ్ ను అతని ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. గతం లో విజయ్ నటించిన సర్కార్, బిగిల్ ఆడియో ఈవెంట్ లలో విజయ్ స్పీచ్ ఫ్యాన్స్ ను  ఆకట్టుకుంది తాజాగా మాస్టర్ ఈవెంట్ లో కూడా మరోసారి తన ఫ్యాన్స్ ను ఫిదా చేయడానికి విజయ్ సిద్దమవుతున్నాడు.
 
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ గా కనిపించనుండగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా మాస్టర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి 200 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.
 
తెలుగులో ఈ చిత్రాన్నిమహేష్ ఎస్ కోనేరు విడుదల చేయనున్నాడు. ఇంతకుముందు విజిల్(బిగిల్) ను కూడా తెలుగులో ఆయనే విడుదలచేయగా 3కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక సర్కార్, విజిల్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి తెలుగు విజయ్ మంచి మార్కెట్ సొంతం చేసుకోవడంతో మాస్టర్ కు తెలుగులోనూ హైప్ వచ్చింది. ఏప్రిల్ 10న ఈసినిమా విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: