పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులు ఎంతగా తపిస్తారో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు ఒక్కసారైనా చూస్తాడా మమ్మలిని అని ఆరాటపడతారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కువగా జనాలకోసం జనాలతో గడపడానికే ఇష్టపడతారు. ఆయన సినిమాలు చేసినా జనాలకోసం తపించిన అందులో ఉన్న అర్థమే వేరు. పవన్ కళ్యాణ్ కి జనాల తర్వాతే ఎవరైనా. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసిన మరుక్షణమే వాళ్ళ ముందు ప్రత్యక్షమైపోతారు. అంతగా తన అభిమానులన్నా ప్రేక్షకులన్నా తాపత్రయపడతారు. ఎవరు ఏమనుకున్నా ..ఎన్ని మాటలన్నా మౌనంగా భరిస్తారు. కానీ ఒక్కసారి తన వాళ్ళని గనక ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోరు. నన్నేమైనా అంటే సహిస్తా ..భరిస్తా నా వాళ్ళ జోలికొస్తే మాత్రం తాట తీస్తా అని మాత్రం గట్టిగా సమాధానం చెప్తారు.

 

ఇక పవన్ కళ్యాణ్ కి స్నేహమంటే చాలా గౌరవం. స్నేహానికి ఆయన ఇచ్చే విలువ వెలకట్టలేనిది. అది తన స్నేహితులు త్రివిక్రం శ్రీనివాస్, అలీ ని చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా త్రివిక్రం అంటే ఎంత అభిమానమో ప్రత్యక్షంగా చాలా సార్లు చూశాము. ఆయనకే కాదు పవన్ కళ్యాణ్  అన్నా త్రివిక్రం అంతే ప్రేమగా అభిమానంగా ఉంటారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రం స్నేహం గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ అలీ ల స్నేహం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరే కాదు తన స్నేహితులు డైరెక్టర్ డాలీ, ప్రొడ్యూసర్ శరత్ మరార్ అన్నా చాలా ఇష్టంగా ఉంటారు.

 

వీళ్ళే కాదు పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని ఉన్న ఎవరైనా సరే చిన్న సమస్యలో ఉంటే ఆ సమస్య తెలిసిన వెంటనే తీర్చగలుతారు. ఎప్పుడు మొహంలో చెరగని చిరు నవ్వే ఆయన అన్నిటికి సున్నితంగా చెప్పే సమాధానం. ఆ నవ్వులోనే కోట్ల మంది ఆనందం దాగి ఉంది. పవన్ కళ్యాణ్ అలా కన్నెత్తి చూస్తే చాలు అలా తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానులు పడిపోతారంతే. అది పవన్ కళ్యాణ్ కను చూపుకున్న పవర్. ఇక ఆయన తాజాగా వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలోను నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: