గృహిణి నుంచి దేశాన్ని ఏలే అధినేతలుగా భూమిపై స్త్రీ శక్తి సామర్ధ్యాలేంటో అందరికీ తెలిసిన విషయమే. మహిళల విజయాలను నిజజీవితంలో కొన్ని చూస్తే.. నవలల్లో, సినిమాల్లో కొన్ని పాత్రల ద్వారా మహిళ విజయగాధలను తెలుస్తూంటాయి. మరికొన్ని కథల రూపంలో మహిళలు ఎలా విజయాలు సాధించాలో తెలుస్తుంది. తెలుగు సినిమాల్లో మహిళల ఔన్నత్యాన్ని, వారి వీరగాధలను తెలిపే కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా గా తీసుకున్నవారూ ఉన్నారు.

 

 

న్యాయంకావాలిలో ప్రియుడి మోసానికి బలై.. కోర్టులో అతనిపై గెలిచే పాత్రలో రాధిక మహిళా ఔన్నత్యాన్ని చాటుతుంది. కర్తవ్యంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి, రేపటిపౌరులులో టీచర్ గా భావిభారత పౌరులను తీర్చిదిద్దే టీచర్, ప్రతిఘటనలో సంఘ విద్రోహిని తెగ నరికినా స్త్రీ తలచుకుంటే ఏం చేయగలతో నిరూపిస్తుంది. అమ్మ రాజీనామాలో కుటుంబ పెద్దగా, కడప రెడ్డమ్మ పౌరుషం ఉట్టిపడే పాత్ర, ప్రతిధ్వనిలో పోలీసాఫీసర్ గా, ఇల్లు ఇల్లాలు పిల్లలులో శారద పాత్ర ఎంతో ఉదాత్తతో ఉంటాయి. మయూరి సినిమాలో డ్యాన్స్ పై ప్రేమతో కృత్రిమ కాలుతోనే డ్యాన్స్ చేసే పాత్ర స్త్రీ సంకల్పాన్ని తెలుపుతుంది. ఆడదే ఆధారంలో దర్శకుడు విసు స్త్రీ ఔన్నత్యాన్ని చూపిస్తారు.

 

 

మాతృదేవోభవ సినిమాలో క్యాన్సర్ తో బాధపడుతూ పిల్లల కోసం తాపత్రయపడే పాత్రలో మాధవి పాత్ర కన్నీళ్లు తెప్పిస్తుంది. అశ్విని సినిమాలో ఎన్ని కష్టాలు ఎదురైనా క్రీడల్లో రాణించే యువతి పాత్ర కూడా ఎంతో ఆదర్శంగా ఉంటుంది.  సమాజంలో రాక్షస స్వభావం ఉన్న మగాళ్ల నుంచి స్త్రీ ధైర్యంగా జీవించగలదని ఆమె సినిమాలో ఊహ పాత్ర ద్వారా తెలుస్తుంది. ఇలా ఎన్నెన్నో సినిమాలు మహిళా సాధికారికత కోసం, మహిళల విజయం, పోరాటాలు నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మహిళా దినోత్సవాన తెలుగు సినిమాల్లోని మహిళల విజయగాధలన్నీ తెలుసుకోవాల్సినవే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: