నాచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. త్వరలో వి గా ప్రేక్షకుల ముందుకు రానున్న నాని, శివ నిర్వణ డైరక్షన్ లో టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేశాడని తెలుస్తుంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో తన టాలెంట్ చూపించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో నాని సినిమా కన్ఫాం అయ్యిందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.

 

నానితో ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ సినిమా తీసిన మైత్రి మూవీ మేకర్స్ మరో సినిమా లైన్ లో పెట్టారు. ఇక వివేక్ ఆత్రేయ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. మెంటల్ మదిలో మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకోగా బ్రోచేవారెవరురా మాత్రం కమర్షియల్ గా కూడా సక్సెస్ అందుకుంది. ఎలాంటి హంగామా లేకుండా కూల్ గా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్న వివేక్ నానితో మరో ప్రయోగం చేస్తాడని తెలుస్తుంది. ఇక నాని ఈ సినిమాతో పాటుగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సంక్రుత్యన్ తో కూడా ఒక సినిమా కన్ఫాం చేశాడు.

 

అయితే రాహుల్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది కాని వివేక్ ఆత్రేయ సినిమా ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. చూస్తుంటే నాని మళ్ళీ తన హిట్ ఫాం కొనసాగించేలా పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడని చెప్పొచ్చు. గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత వి ఆ తర్వాత టక్ జగదీశ్ ఇలా వరుస సినిమాలు చేస్తున్నాడు. వి సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటించాడు. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నాని మాత్రం వి మూవీపై భారీ హోప్స్ తో ఉన్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: