ప్రస్తుతం సినిమాలకు బ్యాడ్ సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులకు ఎగ్జామ్స్‌ మొదలు కావటం, మరి కొద్ది రోజుల్లో పదో తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు ప్రారంభం కానుండటంతో థియేటర్లు వెల వెల బోతున్నాయి. దీనికి తోడు కరోనా భయం కూడా ప్రజల్ని థియేటర్ల వరకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యం పెద్ద సినిమాలేవి థియేటర్లలోకి రావటంతో లేదు. ఈ వారం ఆరు సినిమాలు రిలీజ్‌ అయినా అందులో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు.

 

అయితే రెండు మూడు ఇంట్రస్టింగ్ సినిమాలు మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ తనయుడు హీరోగా పరిచయం అయిన ఓ పిట్ట కథ సినిమాలకు బాగానే బజ్‌ క్రియేట్ అయ్యింది. సినిమా గురించి చాలా మంది స్టార్ హీరోలు మాట్లాడటం, ప్రీ రిలీజ్‌ వేడుకకు చిరంజీవి హాజరు కావటం, ఆ వేడుకలో చిరు పొరపాటు తన 152 వ సినిమా టైటిల్‌ను ప్రకటించేయటంతో ఓ పిట్ట కథ హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే సినిమా రిలీజ్‌ ముందుకు వచ్చిన బజ్‌ను క్యాష్ చేసుకోవటం పిట్ట కథ టీం ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి.

 

ఇక ఈ జనరేషన్‌ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అనే సినిమా కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. నలుగురు అమ్మాయిలే ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా డబుల్‌ మీనింగ్ డైలాగులు, బోల్డ్ కంటెంట్‌ తో రూపొందించిన అనుకున్న రిజల్ట్‌ మాత్రం సాదించలేకపోయింది. ఇక ఈ వారం కాస్త గట్టి బజ్‌ క్రియేట్ చేసిన సినిమా పలాస 1978. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రియలిస్ట్‌ అప్రోచ్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారం టాప్‌ ట్రెండ్‌ సినిమా అంటే పలాస 1978 అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: