కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు ఒకేసారి తన వేగాన్ని పెంచి వరసపెట్టి సినిమాలు తీయడమే కాకుండా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు త్వరలోనే ఇతడు ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నాడు. 


దాదాపు అనుకోకుండా ఏర్పడిన మూడేళ్ళ గ్యాప్ ను తనలోని సరికొత్త కోణాన్ని అన్వేషించడంలో కాలం గడిపాను అని చెపుతున్న విష్ణు తనకు వరసగా నలుగురు పిల్లలు పుట్టడంతో తన పై ఇండస్ట్రీ ప్రముఖులు వేసిన సెటైర్లను వివరించాడు. మొదట్లో తనకు కవలలు పుట్టిన తరువాత 5 సంవత్సరాల గ్యాప్ ఆవ్రాయ్ పుట్టాడు అంటూ ఆతరువాత ఐరా పుట్టింది అన్న విషయాలను వివరించాడు.


అయితే ఇలా తనకు వరసపెట్టి పిల్లలు పుట్టడంతో తన పై చాలామంది జోక్స్ వేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఒకసారి ఒక ఫంక్షన్ లో తమ కుటుంబ సన్నిహితులు సుబ్బిరామిరెడ్డి తన వద్దకు వచ్చి నవ్వుతూ ‘ఏవయ్యా నీకు వేరే పనిలేదా పిల్లలు కనడం తప్ప’ అంటూ జోక్ చేసి తనకు షాక్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 


అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక టాప్ యంగ్ హీరో అయితే తనకు కొంతకాలం క్రితం ఫోన్ చేసి ‘నీవల్ల మా ఇంట్లో తిడుతున్నారు పిల్లలను కనండి అంటూ ఒత్తిడి చేస్తున్నారు. నీకు కవల పిల్లలు సరిపోలేదా బాబు’ అంటూ జోక్ చేసిన విషయాన్ని కూడ విష్ణు నవ్వుతూ బయటపెట్టాడు. ఇక తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన జగన్ షర్మిల ‘మా చెల్లెలను ఇబ్బంది పెట్టడం ఆపేయి’ అంటూ జోక్ చేసారని దీనితో పిల్లలను కానినా సమస్యే కనకపోయినా సమస్యే అన్న విషయం తను అర్ధం అయింది అంటూ కామెంట్ చేసాడు. ఇక తాను తీయబోయే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్తకన్నప్ప’ గురించి మాట్లాడుతూ ఈ మూవీకి దర్శకత్వం వహించమని తాను ఒక టాప్ దర్శకుడు దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలు ఎందుకు చిన్న సినిమాలు చేసుకోవచ్చు కదా అంటూ తనకు రివర్స్ క్లాస్ పీకినప్పుడు తనకు పెద్ద సినిమాలలో నటించే అర్హత లేదా అంటూ బాధ పడిన విషయాలను విష్ణు ఉద్వేగంగా వివరించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: