మెగా బ్రదర్ నాగబాబుకు పవన్ మాదిరిగానే సామజిక చైతన్యం చాల ఎక్కువ. ఈ సామాజిక స్పృహతో నాగబాబు అనేక సామాజిక రాజకీయ విషయాల పై అవకాశం చిక్కినప్పుడల్లా తన స్టైల్ కామెంట్స్ చేయడం ఒక పని గా పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో లేటెస్ట్ గా నాగబాబు చేసిన కామెంట్స్ వెనుక పవన్ వ్యూహాలు ఉన్నాయా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 


హిందువులకు మత సామరస్యం బాగా ఎక్కువైందని కాస్త తగ్గించుకుంటే మంచిదని ఈ మధ్య నాగబాబు కామెంట్ చేస్సాడు. అంతేకాదు నాస్తిక ఆస్తిక హిందువులందరూ కలసి మతాన్ని కాపాడుకోవాలని ఏదైనా ఉద్యమం మొదలు పెడితే తనలాంటి నాస్తిక హిందువుల సపోర్ట్ కూడ ఉంటుందని మెగా బ్రదర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.  


అంతేకాదు మన ప్రభుత్వాలే మతాన్ని తోక్కేస్తున్నాయని ఆదాయం కోసం హిందూ దేవాలయాలు ఒక పావులుగా మారిపోతున్న పరిస్థితుల పై నాగబాబు తన ఆవేదన వ్యక్త పరిచాడు. ఇదే సందర్భంలో హిందువుల ఆలయాలకు చెందిన వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోతున్న పరిస్థితుల పై తన ఆవేదన వ్యక్త పరుస్తూ ఈ విషయాలలో బీజేపీ ఆర్ఎస్ఎస్ లు కలగ చేసుకోవాలని నాగబాబు అభ్యర్ధిస్తున్నాడు. 


ఇప్పటికే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సిద్దాంతాలకు దగ్గర అవుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్స్ పవన్ వ్యూహాలకు దగ్గరగా ఉన్నాయా అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ఇదే దేవాలయాల భూముల అన్యాక్రాంత మాఫియా నేపధ్యంలో కొరటాల శివ మూవీలో చేస్తున్న చిరంజీవి ఆ సినిమాలోని డైలాగ్స్ వెనుక రాజకీయాలు లేకుండా జాగ్రత్త పాడమని కొరటాలకు సలహాలు ఇస్తుంటే నాగబాబు మాత్రం హిందూ దేవాలయాలను రక్షించండి అంటూ చిరంజీవి అభిప్రాయాలకు భిన్నంగా పిలుపు ఇవ్వడం అత్యంత ఆశ్చర్యం అంటూ మెగా బ్రదర్ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: