బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక షో వారికి సినిమాల్లో కూడా అవకాశాలను తెచ్చి పెట్టిన సంగతి అందరికి తెలిసినదే. అందరిని తమ అడల్ట్ కామిడీ తో నవ్వించే సదరు నటులు నిజంగానే అటువంటి పనులను స్వయంగా చేస్తూ 4 రోజుల క్రితం పట్టుబడటం ఈవారం అతి పెద్ద కాంట్రవర్సీ. అవును.. జబర్దస్త్ కామెడీ షోలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న "దొరబాబు, పరదేశీ" వ్యభిచారం చేస్తూ పట్టుబడటం చర్చనీయాంశమైంది. 

 

విశాఖపట్నంలో ఈ రకమైన చర్యలు చేస్తూ, ఇద్దరూ అరెస్ట్ కావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సదరు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించిన పోలీసులు, దొరబాబు, పరదేశీలు.. జబర్ధస్త్ నటులు అని తెలిసి, కంగు తిన్నారు. ఇక ఇది జబర్దస్త్ ఫ్యామిలీ కూడా పెద్ద డౌన్ ఫాల్ న్యూస్. మాధవధార లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు, పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేసారు. 

 

IHG

 

హుటా హుటిన అక్కడికి వెళ్లిన వారికి దొరబాబు, పరదేశీతో పాటు ఒక మహిళ, నలుగురు విటులు  మూకుమ్మడిగా దొరికేసారు. కొన్నేళ్లుగా హైపర్ ఆది టీంలో వీరు పని చేస్తున్నారు. అంతేకాదు దొరబాబు, పరదేశీ నుంచి 20 వేల నగదును కూడా పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. వీళ్ళపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొన్నేళ్లుగా హైపర్ ఆది టీంలో ఉన్న దొరబాబుపై ఎ రేటింగ్ పంచులు వేస్తుంటాడు టీం హెడ్ హైపర్ ఆది.

 

అయితే ఆయన వాటినే నిజజీవితంలో పాటిస్తాడని హైపర్ కూడా ఊహించి ఉండడేమో మరి! ఇక పరదేశి కూడా హైపర్ ఆది స్కిట్స్‌కు రచనా సహకారం అందిస్తుంటాడు. వీరు కొన్ని రోజులుగా హైదరాబాద్ నుంచి మహిళలను తీసుకువచ్చి, విశాఖపట్నంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఇద్దరూ దొరికిపోవడంతో మరింతమంది జబర్దస్త్ నటులపై కూడా ఇప్పుడు పోలీసులు అనుమానంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇది జబర్దస్త్ కి జబర్దస్త్ ట్విస్ట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: