తాజాగా 35ఏళ్ళ హాలీవుడ్ సింగర్ క్యాటీ పెర్రీ తన కాబోయే భర్త ఓర్లాండో బ్లూమ్ తో కలిసి తన మొదటి బిడ్డకి జన్మనిస్తున్నానని అధికారికంగా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన న్యూ మ్యూజిక్ 'నెవెర్ వర్న్ వైట్' వీడియో ని కూడా విడుదల చేసింది. ఈమెకు యూట్యూబ్ లో మూడు కోట్ల 64 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 'లౌడ్' అనే వీడియో పాట ద్వారా ఆమె చాలా ప్రఖ్యాతి చెందింది.

 



మార్చి 3వ తేదీన హాలీవుడ్ ధారావాహికల నటుడైన రాస్కో బార్న్  మరణించాడు. రాస్కో బార్న్ మరణించినప్పుడు అతని వయస్సు 69 సంవత్సరాలు కాగా... దాదాపు తన సంగం వయసు అనగా 30 సంవత్సరాల పాటు తన నటనతో ఇంగ్లీష్ ఆడియన్స్ ని బాగా మెప్పించాడు. ర్యాన్'స్ హోప్ అనే టెలివిజన్ సీరియల్ లో నటించిన తరువాత అతనికి బాగా పాపులారిటీ వచ్చింది.




మంగళవారం ఉదయం పూట అమెరికాలో ని నాష్ విల్లే, ఇంకా ఇతర నగరాలలో విజృభించిన టోర్నాడోలు(సుడిగాలి/తూఫాన్)ఎంతో ఆస్తినష్టం తో పాటు ప్రాణ నష్టానికి కూడా దారి తీశాయి. ఐతే ప్రఖ్యాత అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఒక మిలియన్ డాలర్లను(రూ.7కోట్ల 40లక్షలు) టోర్నాడోల కారణంగా నష్టపోయిన ప్రజలకు దానం చేసింది. అలాగే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బాధితులకు ఎంతో కొంత సాయం చేయమని కోరింది. దాంతో ఆమె యొక్క దానధర్మ గుణాన్ని ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతున్నారు.

 



ఇకపోతే 2018వ సంవత్సరంలో విడుదలైన ఎ క్వైట్ ప్లేస్ (A Quiet Place) సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా ని ఏ ఒక్క డైలాగు లేకుండా కేవలం సౌండ్ తోనే చాలా అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు, నటుడు జాన్ క్రాసినస్కీ ని ఎంతోమంది కొనియాడారు. కేవలం శబ్దం ఆధారంతో మానవులని, జంతువులని ఇంకా ప్రతి ఒక్క జీవరాసులుని వేటాడే వికృత రాకాసుల గురించి ఈ సినిమాలో చూపించారు. ఐతే ఎటువంటి శబ్దం చేయకుండా వీటి నుండి ఒక ఫ్యామిలి ఎలా తప్పించుకుంటారు అనేది ఈ చిత్రం యొక్క కథాంశం. ఫస్ట్ విడుదలైన చిత్రంలో ఒక ఫ్యామిలీ రాకాసులతో పోరాడగా దానికి క్లైమాక్స్ మాత్రం సీక్వెల్ ఎ క్వైట్ ప్లేస్ II (A Quiet Place 2) లో చూపిస్తానని ఆ చిత్ర బృందం చెప్పుకొచ్చారు. ఐతే ఇటీవల ఎ క్వైట్ ప్లేస్ II కు సంబందించిన ఓ ట్రైలర్ విడుదలై ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రం మార్చి 20వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: