కామెడీ షోల యందు జబర్దస్త్ షో వేరయా అన్న మాదిరి దూసుకుపోతుంది బుల్లితెర జబర్దస్త్‌ షో. ఇక దాన్ని డ్యామినేట్ చేయడం చాలా కష్టం అని, అలాంటి షో నిర్వహలకు ఇప్పటికే తేట తెల్లమైపోయింది. ఎందుకంటే ప్రజల్లోకి జబర్దస్త్ అంత బలంగా నాటుకు పోయింది. జబర్దస్త్ నుండి చాలా మంది బయటకు వెళ్లిపోయారు కానీ, నాగబాకు వెళ్లడం షోకి ఒకింత బాడ్ థింగ్ అనే చెప్పాలి. అది పాతకధ. కానీ దానైపుణ్యామాని ఇపుడు నాగబాబు, సదరు షో యాంకర్ అనసూయల మధ్య కొందరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.

 

IHG

 

అనసూయ బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో షోలు చేసింది... ఇక ఆమె 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో నటిగా మారిన సంగతి అందరికి విదితమే. ఆ తరువాత 'క్షణం' సినిమాతో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరచుకుంది. 'విన్నర్', 'ఎఫ్ 2' లాంటి చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో నటించడంతో పాటు 'రంగస్థలం' సినిమాలో హీరో అత్తగా కనిపించి, విమర్శకుల ప్రశంసలు పొందింది.

 

అయితే రామ్ చరణ్ తో కలిసి నటించిన అనసూయకి, ఈసారి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఇద్దామని అనుకున్నారట సదరు టీం. చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమాలో అనసూయకి ఓ రోల్ ఇవ్వాలని వారు భావించారు. కానీ ఇప్పుడు ఆ పాత్ర కోసం మరో నటిని సెలెక్ట్ చేసుకున్నట్లు వినికిడి. దీనికి కారణం నాగబాబు అని తేల్చి చెప్పేస్తున్నారు కొందరు. చిరంజీవి సినిమాలో అనసూయకి ఛాన్స్ రాకుండా తెరవెనుక నాగబాబు రాజకీయం చేసాడని వారి వాదన.

 

IHG

 

ఇదంతా ఎక్కడ మొదలయ్యిందంటే 'జబర్దస్త్' షో వదిలేసి.. 'అదిరింది' అనే కామెడీ షోకి జడిగా వెళ్లాడు నాగబాబు. అయితే అక్కడే వచ్చింది అసలు చిక్కు.. తను గొప్పగా తీసుకున్న 'అదిరింది' షోకి యాంకరింగ్ చేయమని నాగబాబు ముందుగా అనసూయని అడిగారట. దానికి ఆమె ఒప్పుకోలేదని గుస గుస. ఆ కారణంగానే చిరంజీవి సినిమాలో అనసూయ కోసం అనుకున్న పాత్ర వేరే వెళ్లేలా చేశాడట నాగబాబు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ... ఇపుడు ఈ విషయం పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది...
 

మరింత సమాచారం తెలుసుకోండి: