ఈ వారం మొత్తంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచిన అంశం మంచు వారి వారసుడు మంచు మనోజ్... మెగా హీరో రామ్ చరణ్ మధ్య ఉన్న అనుబంధం. చిరంజీవి మోహన్ బాబు మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ.. ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ  ఉంటారు. వీరిద్దరిని చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ అన్నట్లుగా భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఎప్పుడు వీరిద్దరూ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడమే కాదు... వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. 

 

 

 మొన్నటికి మొన్న మా అసోసియేషన్ గొడవల్లో మేమిద్దరం ఎన్ని గొడవలు పడుతున్నా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అంటూ మోహన్ బాబు చెప్పటం...  ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబుని ఆలింగనం చేసుకుని  చెంప మీద ముద్దు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ రెండు కుటుంబాలకు చెందిన వారసులు మంచు మనోజ్ రామ్ చరణ్ ల మధ్య కూడా ఇలాంటి మంచి సంబంధమే ఉంది. మొన్నటికి మొన్న మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా మొదటి క్లాప్ కొట్టడానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి మాట్లాడిన మంచు మనోజ్ ఎంతో ప్రమోషనల్ అయ్యాడు. 

 

 

 నా నిజమైన ప్రాణ స్నేహితుడివి నువ్వే అంటూ మంచు మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే ఇదే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి మంచు మనోజ్ రామ్ చరణ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి ఈవెంట్ లో కలిసిన వీరిద్దరూ ఎంత క్లోజ్ గా  మూవ్ అవుతూ సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. దీంతో ఈవారం ఇద్దరి అనుబంధం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అటు మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు మధ్య ఉన్న అనుబంధం... మంచు మనోజ్ రామ్ చరణ్ ల వరకూ కొనసాగుతూనే వచ్చింది అని అటు మంచు వారి అభిమానులతో పాటు మెగా అభిమానులు  కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: