టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చాలా మంది హీరో...హీరోయిన్ల పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచురితం అవుతూ ఉన్నాయి. అయితే ఇలా ప్రచురితమైన వార్త లలో కొన్ని నిజాలు ఉండగా కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని వారాల నుంచి బుల్లితెరపై ఎక్కువగా వినిపిస్తున్న పెళ్ళి కబుర్లు... టాలీవుడ్ యువ హీరోలైన  నితిన్ నిఖిల్  పెళ్లి లతో పాటు... మరోవైపు నయనతార అనుష్క పెళ్లి కి సంబంధించి పలు వార్తలు కూడా టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే నితిన్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన విషయం తెలిసిందే. అయితే సడన్ గా తెరమీదికి పెళ్లి విషయాన్ని తీసుకొచ్చి నితిన్ టాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ షాకిచ్చాడు. ఇక తనది ప్రేమ వివాహం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరోవైపు యువ హీరో నిఖిల్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇంకొన్ని రోజుల్లో ఈ యువ హీరోలు ఇద్దరికీ పెళ్ళి జరిగి ఇంటివారు కాబోతున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పటినుంచి కాదు గత కొన్ని వారాల నుంచి ఈ యువ హీరోల పెళ్లి టాపిక్  టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వీరితో పాటు అనుష్క పెళ్లి గురించి కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అనుష్క పెళ్లి ప్రభాస్ తో ఫిక్స్ అయిందని కొంతమంది అంటుంటే... లేదు అనుష్క పెళ్లి ఒక స్టార్ క్రికెటర్ తో ఫిక్స్ అయింది అని కొంతమంది అంటున్నారు. స్టార్ క్రికెటర్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని అనుష్క క్లారిటీ ఇచ్చినప్పటికీ వార్తలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార... దర్శకుడు నిర్మాత విఘ్నేశన్  ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 

 

 

ఇప్పటికే వీరి ప్రేమాయణం మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ఇక ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే  దానిపై కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈసారైనా నయనతార పెళ్లి చేసుకుంటుందా.. లేదా వీరిద్దరి ప్రేమాయణం ఎక్కడి వరకు వెళుతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరిద్దరే  దర్శనమిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఇద్దరు చాలా క్లోజ్ గా  మూవ్ అవుతు.. ఒకరిని విడిచి ఒకరు ఉండడం లేదు. దీంతో ఈ వారం ఈ జంట హాట్ టాపిక్ గా  నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: