టాలీవుడ్  లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో . విజయ్ దేవరకొండ.. ఏం చేసినా ..ఏం మాట్లాడినా సెన్సేషనే. ఏం వేసుకున్నా ఫ్యాషనే.  అర్జున్ రెడ్డితో మొదలైన ఈ క్రేజ్, ఈ చరిష్మా.. విజయ్ విక్టరీకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేకపోతున్నాయా..? స్టోరీల మీదకన్నా.. సెన్సేషన్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నఈ రౌడీ హీరో .. అలర్ట్ అవ్వాల్సిన టైమొచ్చిందా..? ఏ మ్యాజిక్ చేసి ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేశాడో ఇప్పుడు అదే మ్యాజిక్ మొనాటనీ అవుతోందా..? 

 

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సెన్సేషన్.  హిట్ , ఫ్లాపులతో సంబందం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ సొంతం. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ఏమనుకుంటే అదే మాట్లాడతాడు. ఏది చెయ్యాలనిపిస్తే..అదే చేస్తాడు. ఏం వేసుకోవాలనిపిస్తే..అవే వేస్కుంటాడు.  విజయ్ కున్న ఫోర్స్, క్రేజ్ , అతని యాటిట్యూడ్, ఇవే అతన్ని అందరిలో డిఫరెంట్ గా ఫోకస్ చేశాయి. అయితే ఇవే..ఇప్పుడు సక్సెస్ ఫుల్ కెరీర్ ను క్వశ్చన్ చేస్తున్నాయి.

 

గీతగోవిందం తర్వత వచ్చిన నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ ఏవీ పెద్ద హిట్ అవ్వలేదు.  ఎందుకంటే .. అందరికన్నా డిఫరెంట్ గా సినిమాలు చెయ్యాలనుకుని ప్రయోగాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. సబ్జెక్ట్ సెలక్షన్లో ఎక్కడో మిస్ ఫైర్ అవుతున్నాడు. తన క్రేజ్ కి ఏ సినిమా చేసినా జనాలు చూస్తారు అనే గుడ్డి నమ్మకం విజయ్ ను ప్రేక్షకులకు దూరం చేస్తోంది. 

 

రీసెంట్ గా నలుగురు హీరోయిన్లతో క్రాంతిమాదవ్ డైరెక్షన్లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా  కూడా అంతే. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక అస్సలు అడ్రస్ లేకుండా పోయింది. రిలీజ్ అయ్యి జస్ట్ 5 రోజులే అవుతున్నా.. సినిమాకు సంబందించి ఎటువంటి పాజిటివ్ టాక్ లేదు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా కామెంట్స్ ఫేస్ చేస్తున్నాడు విజయ్. ఇంతకుముందు సినిమాల వరకూ ఉన్న మ్యాజిక్ ..ఈ మద్య విజయ్ సినిమాల్లో ఉండట్లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. 

 

ఏ క్రేజ్.. మ్యాజిక్ తో.. ఆడియన్స్ ని విజయ్ ఎట్రాక్ట్ చేశాడో.. ఇప్పుడు అదే మ్యాజిక్ ఆడియన్స్ కి మొనాటనీ అనిపిస్తోంది. రాను రానూ విజయ్ సినిమాలకు సక్సెస్ రేట్ తగ్గుతోంది.. దాంతో పాటే క్రేజ్ కూడా  తగ్గుతోంది. బ్రాండింగ్ మీద, సెన్సేషన్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్న విజయ్ ..ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సిన టైమొచ్చింది. సక్సెస్ చూసి రెండేళ్లవుతున్న విజయ్ ఇప్పుడు ఇదేక్రేజ్ ని కంటిన్యూ చెయ్యాలంటే  పెద్ద హిట్ కొట్టాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: