నేచురల్ స్టార్ నాని సినిమాల వేగం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయిపోతున్నాయి. సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు ఉండే విధంగా తన ప్లాన్ ను కొనసాగిస్తూ సినిమా సినిమాకు తన కథల ఎంపిక విషయంలో నాని చూపెడుతున్న శ్రద్ధ ముందు చూపు ఇండస్ట్రీ వర్గాలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 


ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ కోసం దేశంలోని ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ‘టాక్సీ వాలా’ చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో నాని ‘శ్యామ్ సింగా రాయ్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే ఈ మూవీని డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.


కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో నాని బెంగాలీ బాబుగా నటిస్తున్నాడు. ఈ మూవీలో నాని త్రిపాత్రాభినయం చేస్తున్నాడని లీకులు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలకు సంబంధించి వస్తున్న లీకులు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 


ఇప్పటికే మ్యూజిక్ కోసం ఏ ఆర్ రెహ్మాన్ తో చర్చలు జరుపుతున్నారు అని వార్తలు రావడంతో పాటు ఇప్పుడు కెమెరా కోసం దేశంలోనే టాప్ కెమెరామన్ నిరవ్ షా తో మాట్లాడుతున్నారట. నిరవ్ షా ఎన్నో బాలీవుడ్ కోలీవుడ్ పెద్ద సినిమాలకు పనిచేసాడు. ప్రస్తుతం విశాల్ డిటెక్టీవ్ 2 కి పని చేస్తున్నాడు. తెలుగు సినిమాలకు సంబంధించి ఇతడు గతంలో అనుష్క ‘సైజు జీరో’ కు కూడ పని చేశాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం జులైలో పూర్తి అవుతుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక శ్యామ్ సింగా రాయ్ షూటింగ్ మొదలు పెడతారు  అని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్తలను బట్టి చూస్తుంటే ఈ ఏడాది ఏకంగా నాని నుండి మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: