ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ నిత్యం ప్రేక్షకులని నవ్విస్తాడు మన యాంకర్ ప్రదీప్. ప్రదీప్ మాచిరాజు ఎన్నో టీవి ప్రోగ్రాంస్ చేస్తూ ఎంతగానో అలరిస్తాడు. చక్కటి టైమింగ్తో మంచి హాస్యాన్ని పండిస్తాడు. ప్రదీప్ కామిడీకి ఎందరో అభిమానులు కూడా ఉన్నారు. అయితే ప్రదీప్ ఢీ వంటి ఎన్నో షోస్ని చేసి ఎంతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ బుల్లితెర యాంకర్ ఇప్పుడు తెరపై కనపడబోతున్నాడు.
 
IHG
 
 
 
ప్రదీప్ కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన విషయం తెలిసినదే. జులాయి సినిమాలో ఆర్.జె గా బన్నీ ఫ్రెండ్ కింద నటించాడు ప్రదీప్ మాచిరాజు. అలానే 100% లవ్ చిత్రంలో కూడ చిన్న పాత్రలో నటించాడు మన యాంకర్. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాత్రం మరో ఎత్తు. ఇప్పుడు తానే హీరోగా కనపడబోతున్నాడు. ఒక హీరోగా తన మొదట సినిమాతో వస్తున్నాడు. ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా? అంటూ ప్రదీప్ వస్తున్నాడు.
 
 
అయితే ఆ చిత్రం కోసం ప్రదీప్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు పాటలు కూడా విడుదల అయ్యాయి. వాటికి ఎంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ప్రేక్షకుల నుండి. అమృత అయ్యర్ ప్రదీప్ సరసన నటించనుంది. ఈ చిత్రాన్ని మున్నా దర్శకత్వం వహించనున్నాడు. అనూప్ రూబెన్స్ పాటల్ని అందిస్తున్నాడు.
 
IHG
 
 
అలానే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ కూడా ఎంతో ఆకట్టుకుంది. నీలి నీలి ఆకాశం... పాట మొదట విడుదల అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండో పాట కూడా విడుదల అయ్యింది. మీకో దండం...అనే పాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోలో ప్రదీప్ డాన్స్తో  ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: