ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దాదాపు రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం టైటిల్‌ని వ‌కీల్‌సాబ్ పెట్టారు. ఇక ఈ చిత్ర పోస్ట‌ర్‌ను ఇటీవ‌లె చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్ కి ఫ్యాన్స్ నుంచి అనుహ్య‌మైన స్పందన ల‌భించింది. ప్ర‌స్తుతం ఆయ‌న అటు రాజ‌కియాల‌తో, ఇటు సినిమాల‌తోనూ ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఇప్పుడు సినిమాల మీద ఫుల్ ఫోక‌స్ పెట్టారు. ఈ చిత్రం త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రం అలాగే ఇంకో రెండు మూడు చిత్రాల‌కు సైన్ చేసి ఫుల్ స్పీడ్ మీదున్నారు ప‌వ‌న్‌. 

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్ద‌రి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్‌కి జోడిగా శృతిహాస‌న్ న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వేణు శ్రీరామ్, క్రిష్ చిత్రాల్లో ఒకటి పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది. ఇక ఈ రోజు ఉమెన్స్‌డేని పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్ సినిమా `వ‌కీల్‌సాబ్‌` నుంచి ఓ పాట విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. 

 

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా...
మగువా మగువా నీ సహనానికి సరిహద్దు లు కలవా...
అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు, ఇంటా బయట ఆ ఆ ...
అలుపని రవ్వంత... అననే  అనవంత... వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా...
స.. గ.మ.ప.గ.మ.సా..... గ. మ.ప.మా. గ.... గ. మ.ప.మా.గ... గ.మ.ప.గ.సా...
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా... ఆఆ...
మగువా మగువా నీ సహనానికి సరిహద్దు లు కలవా...
నీ కాటుక కనులు విప్పారకపోతే...
ఈ భూమికి తెలవారదుగా...
నీ గాజుల చేయి కదలాడకపోతే...
ఏ మనుగడ కొనసాగదుగా...

 

ఈ పాట ఇప్పుడు అంద‌ర్నీ అల‌రిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఈ పాట‌కి లేడీస్ ఫ్యాన్స్ బాగా ఎక్కువ‌య్యారు. ఫుల్ జోష్‌గా సాగుతున్న ఈ పాట మంచి వ్యూ కౌంట్‌ని కూడా సాధిస్తుంది. మ‌రి ఈ వారానికి ప‌వ‌న్ సినిమా ప్రోగ్రెస్ ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: