ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ రోజున అనగా మార్చి 8న ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ రోజు అన్ని రంగాల్లో రాణించిన మహిళల సూర్తి దాయకమైన సక్సెస్ ఫుల్ స్టోరీస్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐతే ఈ ఆర్టికల్ లో తెలుగు సినీ రంగంలో నటుల కంటే ఎక్కువ పాపులారిటీని, డబ్బుని సంపాదించి టాలీవుడ్ ని ఏలుతున్న నటీమణుల గురించి తెలుసుకుందాం.


అనుష్క శెట్టి:



బెంగళూరుకు చెందిన అగ్ర కథానాయిక అనుష్క శెట్టి సినీ రంగంలో అడుగు పెట్టి 15 సంవత్సరాలు గడిచినా ఆమె పాపులారిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దేవసేన, భాగమతి, జేజమ్మ లాంటి గొప్ప పాత్రలను చాలా అద్భుతంగా పోషించిన అనుష్క మొదటిలో యోగా ట్రైనర్ గా పనిచేసేదట. కానీ నటన గురించి ఏమీ తెలియని ఆమె సూపర్ సినిమాలో తనకు ఇచ్చిన పాత్రలో బాగా నటించి నాగార్జున ని, పూరి జగన్నాథ్ ని ఆశ్చర్యపరిచింది. తన కెరీర్ మొదటి రోజుల్లో నటన గురించి తెలియకుండానే అప్పటికప్పుడు నటించడం నేర్చుకొని ప్రతి రోల్ కి న్యాయం చేసిందంటే ఆమెలో ఎంత పట్టుదల, కృషి ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరోలు అవసరం లేకుండానే అరుంధతి, భాగమతి, నాన్న, సైజు జీరో లాంటి సినిమాలు తీసి ఒంటి చేత్తో వాటిని బ్లాక్ బస్టర్ హిట్టులని చేసిన ఘనత అనుష్క శెట్టికే దొరుకుతుంది. ఏదేమైనా ఈ 38ఏళ్ళ స్వీటీ శెట్టి ఎంతో కష్టపడి స్టార్ లెవెల్ కు ఎదగడం ఇతర ఫ్రెష్ నటీమణులకు స్ఫూర్తిదాయకం.


సమంత అక్కినేని:


మాయ చేసావే సినిమాతోనే కోట్ల మంది అభిమానులను సంపాదించిన సమంత అక్కినేని ఆ తర్వాత కూడా బృందావనం, దూకుడు అత్తారింటికి దారేది లాంటి రికార్డు లని బద్దలు కొట్టిన సినిమాల్లో నటించి తన క్రేజ్ ని అపరిమితంగా పెంచేసుకుంది. ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం లాంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. కథాబలం ఉన్న రంగస్థలం, యూ టర్న్, సూపర్ డీలక్స్, ఓహ్! బేబీ, జాను లాంటి సినిమాల్లో తన నటనకి ఫిదా అవ్వనివారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నతనంలోనే సినిమాల్లో అడుగుపెట్టి అతి తక్కువ డిజాస్టర్ సినిమాలతో సినీ ఇండస్ట్రీస్ ని మకుటం లేని రాణిలా ఏలుతున్న సమంత లైఫ్ సాటి మహిళలకు స్ఫూర్తి దాయకం.


కీర్తి సురేష్:


మహానటి సినిమాలో సావిత్రి పాత్రని చాలా చక్కగా పోషించిన కీర్తి సురేష్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె నటనకు గాను 66వ నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్/ ఉత్తమనటి అవార్డు ప్రకటించింది. ఈ 27ఏళ్ళ నటి ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీ గా ఉంది.


సాయిపల్లవి:



సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు గడవకముందే సాయి పల్లవి సార్ హీరోయిన్ క్రేజ్ ని సంపాదించింది. మలయాళం ప్రేమమ్ సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత తన ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేందుకు విరామం తీసుకుంది. డాక్టర్ చదువు పూర్తి చేసిన తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ ఒక్క సినిమాలో తాను నటించిన భానుమతి పాత్ర ఎంతగా ఆదరణ పొందిందో మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా తో పాటు రానా సరసన విరాటపర్వం లో ఆమె నటిస్తున్నది. యాడ్స్ చేస్తే వచ్చే కోట్ల రూపాయలను ఆమె సింపుల్ రిజెక్ట్ చేసి తన వ్యక్తిత్వం ఏంటో చెప్పకనే చెప్పేసింది.





మరింత సమాచారం తెలుసుకోండి: