ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే సంవత్సరం అంతా మహిళ పట్ల జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాల పట్ల నోరు మెదపకుండా ఉండి, ఈ ఒక్క రోజు మహిళలను గౌరవించటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కియారా అద్వానీ కూడా ఈ విషయంలో తనదైన స్టైల్‌లో స్పందించింది.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అందుకే ప్రతీ రోజూ మనం సెలబ్రేట్‌ చేసుకోవాలి. అలాంటప్పుడు కేవలం ఒక్క రోజు మాత్రమే సెలబ్రేట్‌ చేసుకోవటం ఏంటి..? నా ఉద్దేశంలో ప్రతీ రోజు మహిళలదే. బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఈ భామ పలు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తోంది. తాజాగా గిల్టీ అనే వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది కియారా.

 

మహిళ మీద జరుగుతున్న అన్యాయాలు, దారుణాలను కట్టడి చేయకుండా కేవలం ఒక్క రోజు సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఉపయోగం లేని చర్య. కానీ ప్రస్తుతం సమాజంలో మార్పు వస్తోంది. మహిళకు మద్దతుగా ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. మనమంతా కలిసి మహిళా సమాజానికి మద్దతుగా పనిచేయాలి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల సంఖ్య భయాందోళనలు కలిగిస్తోంది. దీనిపై అందరూ పోరాడాలి. చట్టాలు మరింత కఠినంగా ఉండాలంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కియారా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#GuiltyOnNetflix

A post shared by KIARA (@kiaraaliaadvani) on

మరింత సమాచారం తెలుసుకోండి: