మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మంచోడు అన్న పేరు ఇండస్ట్రీ లో ఉంది. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే కాదు ఆ రేంజ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఎవరైనా సరే తాము చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు సాధించిన విజయాలు చేసిన సినిమాలు ఇందుకు నిదర్శనం.


అందుకే త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లకు పెద్ద హీరోలు సైతం సలహాలు ఇచ్చేందుకు  జంకుతూ ఉంటారు. అయితే ఓ షాకింగ్ విషయం ఏంటంటే అంతటి త్రివిక్రముడు ఆలీ సలహా తీసుకున్నాడట. ఇది నిజం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమాలోనూ ఓ మంచి పాత్ర ఇస్తూ ఉంటాడు. సన్నాఫ్ సత్యమూర్తి ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ మంచి వేషం ఇచ్చారు. షూటింగ్ పూర్తయి ఆల్ డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఉపేంద్ర నటించిన కొన్ని సన్నివేశాలు ఆలీ చూశారట.

 

 అప్పటికే ఉపేంద్ర పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పగా అది ఫైనల్ కూడా అయిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసిన ఆలీ ఈ పాత్రకు ఎవరో డబ్బింగ్ చెప్పారు. ఏ మాత్రం సూటబుల్ కాలేదు. డబ్బింగ్ చెప్పిన వ్యక్తి గొంతు ఒకలా ఉంటే ఉపేంద్ర హావభావాలు ఎలా ఉన్నాయని త్రివిక్రమ్‌తో అన్నారట.


 ఈ పాత్రకు సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ డబ్బింగ్ చెబితే బాగుంటుంది అని ఆలీ త్రివిక్రమ్‌తో చెప్పడంతో అప్పటికప్పుడు త్రివిక్రమ్ రవి శంకర్ కి ఫోన్ చేసి వెంటనే కాల్షీట్లు తీసుకున్నారట. మరుసటి రోజు వచ్చిన రవిశంకర్ మొత్తం నాలుగు గంటల్లో ఉపేంద్ర పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడట. ఫైనల్‌గా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్రకు రవిశంకర్ గొంతు కరెక్ట్ గా సూట్ అయింది. అలా ఆనాడు ఆలీ ఇచ్చిన సలహాను పాటించిన‌ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: