స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అల వైకుంఠ పురం లో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల సినిమా బాహుబలి రికార్డులు సైతం అధిగమించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ పేరు మార్మోగుతోంది. అల్లు అర్జున్ తన తర్వాత సినిమా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠ పురం లో సినిమా బన్నీ ఇమేజ్ ను రెట్టింపు చేసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తండ్రి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలే ఆహా పేరుతో ఓటీటి డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

భారీ అంచనాలతో.. భారీ పెట్టుబడితో.. భారీ లాభాలు ఆశించి అల్లు అరవింద్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. అయితే `ఆహా` డిజిటల్ స్టోర్ యాప్ అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ ఆహా యాప్ క్రేజ్‌ తీసుకువచ్చేందుకు అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు అర్జున్ తో ప్రమోషన్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక అల్లు అర్జున్ సైతం ఇటీవల పదే పదే బహిరంగ వేదికలపై తన తండ్రి అల్లు అరవింద్ తీసుకువస్తున్నారు.

 

ఈ క్రమంలోనే తన తండ్రి బిజినెస్ కు సాయం చేసేందుకు ఆహా ప్రమోట్ చేస్తూ ఓ ప్రమోషనల్ వీడియో లో బన్నీ నటిస్తున్నాడట ఈ ప్రమోషన్ వీడియోకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న బన్నీసినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో నటించనున్నాడట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు అని సమాచారం. మరి బన్నీ ప్రమోషనల్ వీడియో తండ్రి వ్యాపారానికి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: