ప్రతి వారం ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే గాసిప్ లేకుంటే చాలామందికి నిద్రే పట్టదు కనుక. ప్రతిరోజు ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంటుంది. అలా వచ్చిన గాసిప్స్ లో కొన్ని గాసిప్స్ మాత్రం బాగా హైలెట్ అవుతుంటాయి.. అలాంటి గాసిప్ లలో ఇది కూడా ఒకటి .. ఏంటి అనుకుంటున్నారా? ఇంకేంటి అండి.. 

 

మహేష్ బాబు గురించే ఈ వారం కూడా గాసిప్ వచ్చింది. అది ఏంటి అంటే? చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు మహేష్ బాబు నటిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు వచ్చినట్టే మహేష్ బాబు ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు దాదాపు ఖరారైపోయింది. 

 

ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నట్టు సినిమా టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే ఆలస్యం. ఇంకా ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా దాదాపు 25 రోజులు కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు మహేష్ బాబుకు ఈ సినిమాకో దాదాపు 30 నుంచి 35 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 

 

అయితే ఇక్కడ వరుకు అంత బాగుంది. ఇప్పుడే ఓ గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొట్టడమే కాకుండా మహేష్ బాబు అభిమానులను.. చిరంజీవి అభిమానులను బాధ పెడుతుంది. అది ఏంటి అంటే ? రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు నటించడం చిరు ఇష్టం లేదట. మహేష్, చిరుకి మధ్య మనస్పర్ధలు ఏమి లేవట.. 

 

కానీ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు సినిమాలో మహేష్ బాబుకు 30 కోట్లు ఇచ్చే బదులు రామ్ చరణ్‌నే పెట్టచ్చు కదా అన్నది చిరంజీవి ఆలోచన. ఇదే విషయం గురించి కొరటాలతో మాట్లాడారట. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి.. అందులో నటిస్తూనే 'ఆచార్య'లోనూ నటించడం కుదరదు అని.. అందుకు ఓ ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ ఎంత వరుకు ఉందొ తెలుసుకోవాలని రామ్ చరణ్ కు సూచించినట్టు సమాచారం. మరి ఈ గాసిప్ లో ఎంత నిజం ఉందొ తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: