టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే అతను మాత్రం తన టాలెంట్ తోనే పైకి వచ్చాడు అనేది వాస్తవం. వరుస విజయాలు వచ్చినా రాకపోయినా సరే అల్లు అర్జున్ మాత్రం అతి తక్కువ కాలం లో స్టార్ హీరో అయ్యాడు. మెగా ఫ్యామిలీ ద్వారా అని కొందరు అంటున్నా కాదని మరికొందరు అంటారు. ఇక ఇటీవల ఇతను హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా మంచి విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 

 

ఇక ఈ సినిమా వసూళ్ళ పరంగా కూడా భారీ వసూళ్లను సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరోకి క్రేజ్ పెరిగింది అంటున్నారు. ఇప్పుడు అతనితో సినిమా చెయ్యాలి అంటూ కొంత మంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. గతంలో అతనితో సినిమా వద్దని వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ బన్నీని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. 

 

ఇటీవల తన తండ్రి ని కూడా కొందరు నిర్మాతలు కలిసి సినిమా చెయ్యాలని కోరినట్టు సమాచారం. బన్నీ వద్దకు కూడా కొందరు దర్శకులు వెళ్లి సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక కొందరు బాలీవుడ్ నిర్మాతలు కూడా బన్నీ తో సినిమా చేస్తామని పెట్టుబడులు పెడతామని వస్తున్నారట. ఇటీవల కరణ్ జోహార్ అతనితో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేసినట్టు టాక్. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అల్లు అర్జున్ హింది లో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచార౦ ఎక్కువగా జరుగుతుంది. అక్కడి ఒక దర్శకుడు ఇటీవల బన్నీ ని కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: